- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క రాయి జారి మీద పడ్డా తుక్కుతుక్కే....! అయినా పట్టించుకోని అధికారులు
ఖమ్మం జిల్లా మీదుగా కాకినాడ, విశాఖపట్నం వరకు తరలివెళుతున్న గ్రానైట్ రాళ్ల తరలింపులో.. Special Stories

దిశ, సత్తుపల్లి: ఖమ్మం జిల్లా మీదుగా కాకినాడ, విశాఖపట్నం వరకు తరలివెళుతున్న గ్రానైట్ రాళ్ల తరలింపులో ఎలాంటి నిబంధనలు పాటించకుండా అజాగ్రత్తగా తరలిస్తున్నారని జిల్లా ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రాళ్ల తరలింపులో కనీస నియమ నిబంధనలు పాటించకపోవడం విడ్డూరంగా ఉంది అని పేర్కొంటున్నారు. జిల్లాలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ, మైనింగ్ అధికారులు కానీ, పోలీస్, రెవెన్యూ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారులు కానీ ఆ లారీల వైపు పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం. జిల్లాలో ఇప్పటివరకు అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రోడ్లు గుంతలు తేలుతున్నాయి.
కరీంనగర్, వరంగల్, ఖమ్మం వంటి ప్రాంతాల నుంచి వందలాది లారీలు ఖమ్మం జిల్లా మీదుగా కాకినాడ, విశాఖపట్నం పోర్టులకు గ్రానైట్ రాళ్లు తరలిస్తున్న క్రమంలో గతంలో సత్తుపల్లి శివారు కల్లూరు తల్లాడ పరిసర ప్రాంతాలలో లారీపై ఉన్న గ్రానైట్ రాళ్లు ఒక్కసారిగా కింద పడిపోవటం చుట్టూ జనసంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. గతంలో భారీ రాళ్లు తరలించే సమయంలో లారీ పై లోడ్ చేసిన తర్వాత బెల్ట్ ద్వారా లేదా ఇతర విధంగా జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటి జాగ్రత్తలు పాటించకుండా అధిక లోడ్లు వేస్తూ ఓవర్ స్పీడ్ తో వాహనాలు వెళ్తున్నాయి.
ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలను భయబ్రాంతులకు గురి అవుతున్నట్టు వాపోతున్నారు. లారీలపై ఓవర్ లోడ్ కారణంగా లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్లు గుంతలగా మారుతున్నాయి. దీనికి తోడు అతి వేగంగా నడపటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, జిల్లా రవాణా అధికారులు స్పందించి ఓవర్ లోడ్ తో వెళుతున్న లారీలను రక్షణ నిబంధనలను పాటించకుండా అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ రాళ్లు తరలిస్తున్న వాహనాలపై తగు చర్యలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా నివారించాలని జిల్లా ప్రజలు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.
- Tags
- granite lorries






