- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మండల కేంద్రం అభివృద్ధిపై నీలి నీడలు
ఉమ్మడి జిల్లాలో వెనుక బడిన మండలంగా పేరొందిన చింతకాని, గతంలో ఖమ్మం నియోజకవర్గంలో ఉండి అభివృద్ధికి నోచుకోలేదు.

దిశ చింతకాని : ఉమ్మడి జిల్లాలో వెనుక బడిన మండలంగా పేరొందిన చింతకాని, గతంలో ఖమ్మం నియోజకవర్గంలో ఉండి అభివృద్ధికి నోచుకోలేదు. మండల కేంద్రంలో బండి రత్నాకర్ హయాంలో తాసిల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేశారు. మండలంలో ప్రధానంగా సరైన వసతులు లేకపోవడంతో ప్రజలు ఖమ్మం జిల్లా కేంద్రం పై ఆధారపడాల్సి వస్తోంది. మండల కేంద్రానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక విద్యార్థులు.... ఖమ్మం వెళ్లాల్సి వస్తోంది. మండలంలో ఉన్న నాగులవంచ ప్రభుత్వ కళాశాల కేవలం ఐదు గ్రామాలకు మాత్రమే పరిమితమైంది. మిగతా గ్రామాల విద్యార్థులు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
ప్రాథమిక ఆసుపత్రి లో సరైన వసతులు లేక అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రంలోని ఆసుపత్రిని కనీసం 30 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అంటున్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా సైడ్ డ్రైన్ లేక పెద్ద వర్షం వచ్చింది అంటే రోడ్ మీదనే వరద ప్రవాహం ఉంటుంది. 2004 లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండల కేంద్రంలో కిలారు సరోజినీ సర్పంచ్ గా చాలా వరుకు గ్రామంలో సీసీ రోడ్లు మరియు మంచినీటి సౌకర్యం,సైడ్ డ్రైన్లు అప్పటి డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టారు.మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కస్తూర్భా పాఠశాల ప్రభుత్వ స్థలం లేక లచ్చగూడెం తరలి వెళ్ళింది. మినీ స్టేడియం నిర్మాణం లో కూడా ప్రభుత్వ స్థలం లేక లచ్చగూడెం తరలి పోయింది. ఇటీవల మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణం కోసం సరైన స్థలం లేకపోవడంతో పక్క నే ఉన్న మత్తేకేపల్లి గ్రామానికి వెళ్లి పోయింది. ఇలా మండల కేంద్రానికి అభివృద్ధి విషయంలో అన్యాయం జరుగుతుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
చింతకాని మండల కేంద్రానికి జనరల్ రిజర్వేషన్ రావటం తో ఆశావహులు పావులు కదుపుతున్నారు. మండల కేంద్రంలో సర్పంచ్ ఏది ఏమైనా గెలిచి తీరాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధాన పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. మండల కేంద్రంలో ఈసారి ప్రజలు అధికార పార్టీ జై కొట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కి మండల కేంద్రమైన చింతకాని సర్పంచ్ స్థానాన్ని కానుకగా ఇవ్వాలని నాయకులు పావులు కదుపుతున్నారు. ఈ సారి మండల కేంద్రానికి ఎక్కువ నిధులు కేటాయించి పెద్ద మొత్తంలో అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.






