డీఎస్పీని అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు

by Elthuri vijay kumar |

కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ని ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.

డీఎస్పీని అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు
X

డీఎస్పీని అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు

- కొత్తగూడ డివిజన్ లో సీసీ కెమెరాల ఏర్పాటులో డీఎస్పీ కీలకపాత్ర

- కేసుల సత్వర పరిష్కారంలో చురుకైన పాత్ర పోషిస్తున్న డీఎష్పీ అబ్దుల్ రెహమాన్

దిశ, కొత్తగూడెం: కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ని ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగూడెం డివిజన్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టి, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చేయడంతో డీఎస్పీ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ప్రాపర్టీ కేసుల్లో ప్రస్తుతం పోలీసు శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను ఉపయోగించి నేరస్తులను పట్టుకొని సొత్తును రికవరీ చేసి బాధితులకు త్వరితగతిన అందేలా చూడటంలో ఆయన చొరవ మరువలేనిదని అన్నారు. అదే విధంగా సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సైబర్ నేరాల్లో నగదును కోల్పోయి, బాధితులు వెంటనే స్పందించి ఫిర్యాదు చేసినప్పుడు తక్షణమే స్పందించి వారికి అండగా ఉన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి(బ్లాక్ స్పాట్స్) వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. పెండింగులో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేసినదుకు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాన్ని అందించారు.

Next Story