- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిల్వ, కుళ్లిన మాంసం..ఇష్టారాజ్యంగా విక్రయాలు
ఖమ్మం నగరంలో కొన్ని మాంసం విక్రయ దుకాణాల్లో కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసాన్ని అమ్ముతూ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.

Some meat shops in Khammam city are playing with public health by selling rotten and stored meat
ఖమ్మం నగరంలో కొన్ని మాంసం విక్రయ దుకాణాల్లో కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసాన్ని అమ్ముతూ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కార్పొరేషన్ అధికారులు లెక్కల ప్రకారం ఖమ్మం నగరంలోని వందకు పైగా మాంసం విక్రయ దుకాణాలు ఉన్నాయి. ఈ చికెన్, మటన్ షాపులకు కార్పొరేషన్ అధికారులు ట్రేడ్ లైసెన్సులు ఇస్తుంటారు. తర్వాత పారిశుధ్య విభాగం అధికారులు దుకాణాలను పట్టించుకోవట్లేదు, తనిఖీలు చేయడం అన్న ఊసే మరిచారు. తరచూ తనిఖీలు లేకపోవడంతో పలు మాంసం దుకాణాల్లో రోగాలతో చనిపోయిన గొర్రెలు, మేకలు, కోళ్లు తదితర జీవాలను కోసి విక్రయిస్తున్నారని తెలుస్తోంది. నిల్వ ఉంచిన దుర్వాసన వస్తున్న మాంసాన్ని పెద్దపెద్ద రెస్టారెంట్లకు సైతం ససరఫరా చేయడం గమనార్హం. ఫలితంగా ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి. - దిశ, ఖమ్మం కార్పొరేషన్
దిశ, ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మం నగరంలో గల్లీకొక మాంసం విక్రయ దుకాణం ఏర్పాటు చేస్తున్న తరుణంలో మాంసం విక్రయాలపై పర్యవేక్షణ కరువైందనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల త్రీ టౌన్ ప్రాంతంలో ఒక మటన్ షాపులో నిల్వ ఉంచిన మాంసం విక్రయించడంతో అధికారులకు ఫిర్యాదుల అంది చర్యలు తీసుకున్నారు. అయితే తరచూ తనిఖీలు లేకపోవడంతో పలు మాంసం దుకాణాల్లో రోగాలతో చనిపోయిన గొర్రెలు, మేకలు, కోళ్లు తదితర జీవాలను కోసి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారని తెలుస్తోంది. నిల్వ ఉంచిన దుర్వాసన వస్తున్న మాంసాన్ని పెద్దపెద్ద రెస్టారెంట్లకు కూడా ససరఫరా చేయటం గమనార్హం. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తరచూ తనిఖీలు చేయాల్సి ఉండగా కేవలం లైసెన్స్‌లు ఇచ్చి వదిలేస్తున్నారు . మాంసం దుకాణాల పరిస్థితి పట్టించుకోవట్లేదు
నగరంలో 100పైగా మాంసం విక్రయ దుకాణాలు
కార్పొరేషన్ అధికారులు లెక్కల ప్రకారం ఖమ్మం నగరంలోని వందకు పైగా మాంసం విక్రయ దుకాణాలు ఉన్నాయి. ఈ చికెన్, మటన్ షాపులకు కార్పొరేషన్ అధికారులు ట్రేడ్ లైసెన్సులు ఇస్తుంటారు. తర్వాత పారిశుధ్య విభాగం అధికారులు దుకాణాలను పట్టించుకోవట్లేదు. అక్కడ ఎలాంటి మాంసం విక్రయించినా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.
పశు వైద్యుడు ధ్రువీకరణ పత్రం ఉంటేనే..
మాంసం విక్రయ దుకాణాల్లో ఒక జంతువును వధించి మాంసం విక్రయించేటప్పుడు అది ఆరోగ్యంగా ఉందని పశు వైద్యుడు దృవీకరణ పత్రం ఇవ్వాలి. దానిని కార్పొరేషన్ అధికారులు పరిశీలించాలి అనంతరమే ఆ జంతువు, లేదా కోడి మాంసాన్ని విక్రయించాలి. ఇవేవీ లేకుండానే మాంసం విక్రయిస్తున్నా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఇటీవల కొన్ని రెస్టారెంట్లలో కార్పొరేషన్ పారిశుధ్య విభాగం అధికారులు తనిఖీ చేసినప్పుడు నిల్వ ఉన్న కుళ్లిన మాంస ఉండటం గమనించి సదరు రెస్టారెంట్లకు జరిమానాలు విధించారు. అయితే ఆ మాంసం ఎక్కడ కొనుగోలు చేశారనే విషయం ఆరా తీయలేదు. అలాగే మాంసం విక్రయించే దుకాణాలకు వెళ్లి తనిఖీలు చేయడం అన్న ఊసే మరిచారు. ఫలితంగా పలు మాంసం విక్రయ కేంద్రాలు నిల్వ ఉండి దుర్వాసన వస్తున్న మాంసాన్ని రెస్టారెంట్లకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి.
శానిటరీ ఇన్‌స్పెక్టర్, జవాన్లతో నిఘా కమిటీ ఏర్పాటు
అనిల్ కుమార్, కేఎంసీ సహాయ కమిషనర్
నిల్వ ఉంచిన దుర్వాసన వచ్చే మాంసం విక్రయాల నివారణకు శానిటరీ ఇన్‌స్పెక్టర్, జవాన్లతో కలిపి ఒక నిఘా కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ తరచూ మాంసం విక్రయ దుకాణాలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటుంది. కాగా జంతువులు వధించేందుకు ఒక ప్రత్యేక స్థలం లేకపోవడంతో దుకాణాల వద్ద వాటిని వధించి మాంసం విక్రయిస్తున్నారు. దీనివల్ల అనారోగ్యంతో ఉన్న జంతువులను గుర్తించలేక పోతున్నాం. దీనిపై కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటాం.






