మీషో పేరుతో మోసాలకు స్కెచ్..

by Naveena |

ఆన్లైన్ షాపింగ్ యాప్ మీషో 9వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా లో 15 లక్షల క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారని బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు స్కాం కు స్కెచ్ గీశారు.

మీషో పేరుతో మోసాలకు స్కెచ్..
X

దిశ, అశ్వారావుపేట: ఆన్లైన్ షాపింగ్ యాప్ మీషో 9వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా లో 15 లక్షల క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారని బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు స్కాం కు స్కెచ్ గీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కు చెందిన దినేష్ పీటర్సన్ అనే వ్యక్తికి మీషో కంపెనీ పేరిట పోస్టల్ లో రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. అందులో ఓ స్క్రాచ్ కార్డు, కంపెనీ నిబంధనల లెటరు ఉంది. కార్డుని స్క్రాచ్ చేయగా రూ.15 లక్షల 51 వేల క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నట్లు చూపింది. వెరిఫికేషన్ కోసం లెటర్ లో ఇచ్చిన హెల్ప్ లైన్ వాట్సాప్ నంబర్ కు స్క్రాచ్ చేసిన కార్డు, లెటర్, ఎన్వలప్ కవర్, సదరు వ్యక్తి ప్రభుత్వ గుర్తింపు కార్డు పంపించాలన్నారు.

క్యాష్ ప్రైజ్ నగదుని క్లైయిమ్ చేసుకునేందుకు టాక్స్ వర్తిస్తుందని నిబంధనలలో పేర్కొన్నారు. ఇదంతా కూడా మీషో కి సంబంధించినవిగా ఉండడంతో.. నిజమని నమ్మి వివరాలు వాట్సప్ చేశారు. వెరిఫికేషన్ పూర్తయిందని మీషో విన్నర్ లెటర్ ను తిరిగి వాట్సప్ లో పంపించారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం క్యాష్ ప్రైజ్ నగదు బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేముందు.. రూ.15510 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని,క్యాష్ ప్రైజ్ సదరు వ్యక్తి బ్యాంకు ఖాతాలో జమ అయిన తర్వాత.. ఈ రూ.15 వేలు నగదును తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు. ముందుగా నగదు డిపాజిట్ చేయాలని ఉండడంతో.. అనుమానం వచ్చి గూగుల్ లో సెర్చ్ చేశాడు. మీషో పేరిట వచ్చే స్క్రాచ్ కార్డ్, లాటరీ, లక్కీ డ్రా లను నమ్మి మోసపోవద్దని.. మీషో ఇలాంటి వాటిని చేయదని కంపెనీ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. దీంతో క్యాష్ ప్రైజ్ ఫేక్ అని నిర్ధారించుకున్నారు.

Next Story