- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలు మీ కోసం..
ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా ఇంటి వద్దకే భద్రాచలం సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలు కేవలం రూ 151 రూపాయలతో అందించబడును అని సత్తుపల్లి డిపో మేనేజర్ యు రాజ్యలక్ష్మి తెలిపారు.

దిశ,సత్తుపల్లి: ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా ఇంటి వద్దకే భద్రాచలం సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలు కేవలం రూ 151 రూపాయలతో అందించబడును అని సత్తుపల్లి డిపో మేనేజర్ యు రాజ్యలక్ష్మి తెలిపారు. సోమవారం డిపో మేనేజర్ కార్యాలయంలో సీతారాములకు కళ్యాణం ముత్యాల తలంబ్రాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి మొదటి బుకింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి వెళ్లలేని వారి సౌకర్యార్థం టిజిఎస్ ఆర్ టి సి లాజిస్టిక్స్ వారి ద్వారా కేవలం 151 రూపాయలతో ఇంటి వద్దకి ముత్యాల తలంబ్రాలను అందించనున్నట్లు ఆమె వివరించారు.
రామభక్తులు ప్రతి ఒక్కరూ ఈ సదా అవకాశాన్ని ఉపయోగించుకొని ముత్యాల తలంబ్రాలను ఇంటి వద్ద పొందాలని ఆమె కోరారు. బుకింగ్ చేసిన వారికి రెండు ముత్యాలతో కూడిన తలంబ్రాలు ఇంటి వద్దనే ఇవ్వబడును,ముత్యాల తలంబ్రాలు కావలసినవారు సత్తుపల్లి డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎస్కే మునీర్ పాషా 9154298585, విలేజ్ బస్ ఆఫీసర్ కిన్నెర ఆనందరావు 9866619189 లను సత్తుపల్లి 9154298594 , అశ్వరావుపేట 9494232424, కల్లూరు 8688972823, వి ఎం బంజర 7382858372, అన్నపురెడ్డిపల్లి 9701573644 లను సంప్రదించాలని కోరారు. సత్తుపల్లి డిపో పరిధిలోని రామ భక్తులందరూ ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ యు రాజ్యలక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పి విజయ శ్రీ, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎస్ సాహితి, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎస్ కే మునీర్ షాషా ,ఆఫీసు సిబ్బంది బాబురావు, టైపిస్టు శ్రీనివాస్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.






