సీసీ రోడ్డు వేశారు.. క‌రెంట్ పోల్ తీయ‌డం మ‌రిచారు

by Nallavelli.Anjaneyulu |

పల్లెగూడెం‌- మంగళగూడెం వరకు రెండు వరుసల బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీంట్లో భాగంగా గోళ్లపాడు గ్రామంలో గ్రామాభివృద్ధి పేరుతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు శాపంగా మారుతున్నాయి.

సీసీ రోడ్డు వేశారు.. క‌రెంట్ పోల్ తీయ‌డం మ‌రిచారు
X

దిశ, ఖమ్మం రూరల్ : పల్లెగూడెం‌- మంగళగూడెం వరకు రెండు వరుసల బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీంట్లో భాగంగా గోళ్లపాడు గ్రామంలో గ్రామాభివృద్ధి పేరుతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు శాపంగా మారుతున్నాయి. సీసీ రోడ్డు నిర్మాణం కంటే ముందే కరెంట్ పోల్ తీయకుండా రోడ్డు నిర్మించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫై ఫోటోలో కనిపిస్తున్నట్లుగా సీసీ రోడ్డు నిర్మించి మధ్య‌లో కరెంట్ పోల్ ఉండటంతో రాత్రిపూట రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నడిరోడ్డు మీద పోల్ ఉండటం వల్ల ద్విచక్రవాహనదారులు, ఆటోలు, ట్రాక్టర్లు ప్రమదాలకు గురయ్యే అవకాశం ఉంది. పోల్స్ పక్కకు మార్చాల్సిన గుత్తేదారు పట్టించుకోకపోవడం వలన వాహనాలు పోల్ ని ఢీకొనే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణనష్టం జరిగితే భాద్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ శాఖ, ఆర్ అండ్ బీ అధికారులు ముందస్తు ప్రణాళిక లేకుండా పనులు చేపట్టడంతో ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు వెడల్పు పనులు పూర్తయినా కరెంటు పోల్ మాత్రం అలాగే ఉండటంతో ద్విచక్ర వాహనదారులు పోల్‌ను తప్పించేందుకు ఎదురుగా వచ్చే వాహనాల వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా సంబంధిత శాఖాదికారులు స్పందించి నడిరోడ్డు మీద ఉన్న కరెంట్ పోల్ను వెంటనే తొలగించి రోడ్డును సక్రమంగా నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story