మానవత్వం చాటుకున్న ఎస్సై బైరు గోపి..

by I. Sairam |

ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తు ఎదురుగా లారీ వస్తున్న విషయం గమనించకుండా లారీని ఢీ కొట్టడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

మానవత్వం చాటుకున్న ఎస్సై బైరు గోపి..
X

దిశ, కారేపల్లి: ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తు ఎదురుగా లారీ వస్తున్న విషయం గమనించకుండా లారీని ఢీ కొట్టడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై పడిపోయి అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని కారేపల్లి ఎస్సై బైరు గోపి పోలీసు వాహనంలో వైద్యం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ లో కామేపల్లి మండల పరిధిలోని జోగ్గూడెంలో పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్న వారణాసి ప్రవీణ్ కుమార్ విధులలో భాగంగా ఉత్తరాలను క్రాస్ రోడ్డు లో బట్వాడా చేసేందుకు ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో క్రాస్ రోడ్ మూల మలుపు తిరుగుతుండగా ఖమ్మం నుండి కారేపల్లి వెళుతున్న లారీని ఢీ కొట్టగా కింద పడి తీవ్రగాయాలయ్యాయి.

తలకు తీవ్ర గాయాలు కాగా కారేపల్లి ఎస్సై బైరు గోపి వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని పోలీసు వాహనంలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారణాసి ప్రవీణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల వాసి.కాగా పోస్టల్ శాఖలో నాలుగు నెలల క్రితమే పోస్ట్మాస్టర్ గా ఉద్యోగం పొంది కామేపల్లి మండల పరిధిలోని జోగ్గూడెం గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రాణాలు కాపాడిన ఎస్సై బైరు గోపిని స్థానిక ప్రజలు అభినందించారు.

Next Story