- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీపీఐ సీనియర్ నాయకుడు బానోతు లోక్య మృతి
ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని చిన్న తండాకు చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు బానోతు లోక్య (95) అనారోగ్యంతో

దిశ, ఖమ్మం రూరల్ : ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని చిన్న తండాకు చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు బానోతు లోక్య (95) అనారోగ్యంతో ఇంటివద్ద మంగళవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ భౌతిక కాయాన్ని సందర్శించి ఎర్రజెండా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుడికి భార్య అయిదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
వీరిలో నాలుగో కుమారుడు బానోతు రామకోటి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, జిల్లా సమితి సభ్యుడిగా క్రియాశీలకంగా కొనసాగుతున్నాడు. నివాళులర్పించిన వారిలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మీడకంటి చిన్న వెంకటరెడ్డి, అజ్మీరా రామ్మూర్తి, సీపీఐ జిల్లా సమితి సభ్యులు చెరుకుపల్లి భాస్కర్, వెంపటి సురేందర్, మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, మండల సమితి సభ్యులు దండి రంగారావు, బానోతు గడ్డ, పాల్తియా శ్రీను, రామ్మూర్తి , జగన్, శాఖ కార్యదర్శి ధరావత్ కృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, జిల్లా నాయకుడు మామిండ్ల సంజీవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాజు, వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకురాలు చంద్రావతి, రిటైర్డ్ ఆర్డిఓ పాండురంగ తదితరులు పాల్గొన్నారు.






