సీపీఐ సీనియర్ నాయకుడు బానోతు మున్ను మృతి

by Kodari Anjali |

ఖమ్మం రూరల్ మండలంలోని ఆరెకోడు తండాకు చెందిన సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు బానోత్ మున్ను (93) వృద్ధాప్యంతో సోమవారం కన్నుమూశారు.

సీపీఐ సీనియర్ నాయకుడు బానోతు మున్ను మృతి
X

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని ఆరెకోడు తండాకు చెందిన సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు బానోత్ మున్ను (93) వృద్ధాప్యంతో సోమవారం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా, సీపీఐ నాయకులు భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడికి, భార్య పిల్లలు ఉన్నారు. ఈ సందర్భంగా మౌలానా మాట్లాడుతూ.. బానోత్ మున్ను పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేసిన నిబద్ధత కలిగిన నాయకుడని కొనియాడారు. ఆయన సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. నివాళులర్పించిన వారిలో జిల్లా సమితి సభ్యులు యడ్లపల్లి శంకరయ్య, పగిళ్ల వీరభద్రం, బానోతు రామకోటి, సిపిఐ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, మాజీ ఎంపీపీ ఆరంపుల సైదులు, ఉప సర్పంచ్ కొరివి వీరన్న, సిపిఐ గ్రామ నాయకులు రామ్ నాయక్, బానోత్ సీతారాం, గుగులోత్ హరిదాస్, వలిసిన శీను, బానోత్ జగన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story