చెరువులో మునిగి సెక్యూరిటీ గార్డు మృతి

by Elthuri vijay kumar |

దుమ్ముగూడెం మండలంలోని గోవిందాపురం గ్రామంలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 66 ఏళ్ల పోడియం మూర్తి చేపల చెరువులో మునిగి మృతి చెందాడు.

చెరువులో మునిగి సెక్యూరిటీ గార్డు మృతి
X

చెరువులో మునిగి సెక్యూరిటీ గార్డు మృతి

గోవిందాపురంలో విషాదం

దిశ, దుమ్ముగూడెం : దుమ్ముగూడెం మండలంలోని గోవిందాపురం గ్రామంలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 66 ఏళ్ల పోడియం మూర్తి చేపల చెరువులో మునిగి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మూర్తి గత మూడు సంవత్సరాలుగా స్థానిక చేపల చెరువు వద్ద సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం ఉదయం చెరువు యజమాని మోసలి రాంబాబు అతడిని చివరిసారిగా చూశాడు. అనంతరం మూర్తి కనబడకపోవడంతో రాంబాబు అతడి బంధువులకు సమాచారం ఇచ్చాడు. బుధవారం ఉదయం చెరువు వద్ద మూర్తి తువ్వాలు కనిపించడంతో అనుమానం కలిగి స్థానికుల సహకారంతో గాలింపు జరిపి మూర్తి శవాన్ని చెరువులో నుంచి వెలికితీశారు. ఈ ఘటనపై దుమ్ముగూడెం ఎస్సై గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story