ఏఐ కాంపిటీషన్స్ లో ఖమ్మం కుర్రవాడు కు రెండో ప్రైజ్

by Ratna Kumari |

దిశ, ఖమ్మం : వేమిరెడ్డి కార్తీక్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సంస్థ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంపిటీషన్ లో పాల్గొని రెండో ప్రై

ఏఐ కాంపిటీషన్స్ లో ఖమ్మం కుర్రవాడు కు రెండో ప్రైజ్
X

దిశ, ఖమ్మం : వేమిరెడ్డి కార్తీక్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సంస్థ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంపిటీషన్ లో పాల్గొని రెండో ప్రైజ్ 6, 50,000 గెలుచుకున్నారు. ఇంటర్ వరకు ఖమ్మంలో చదివి బీటెక్ త్రిబుల్ ఐటీ లో పూర్తి చేసి క్యాంపస్ లోనే 18 లాక్స్ ప్యాకేజ్ తో ఉన్న ఉద్యోగం సంపాదించుకొని ఒక సంవత్సరం ఉద్యోగం చేసి ఉన్నత చదువుల కోసం అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదివారు అక్కడ వరల్డ్ వైడ్ క్యాన్సర్ రీసెర్చ్ టీం లో సభ్యుడిగా ఉంటూ వరల్డ్ వైడ్ కోడింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నారు. గూగుల్ సంస్థ వరల్డ్ వైడ్ గా నిర్వహించిన కాంపిటీషన్లో పాల్గొని లక్షలాదిమందిలో సెకండ్ విన్నర్ గా నిలిచారు. వేమిరెడ్డి కార్తీక్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఏన్కూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో హెల్త్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు.

Next Story