- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షైన్ ఇండియా స్కూల్లో ఘనంగా సైన్స్ డే..
ఖమ్మం నగరం రాపర్తినగర్‌లోని షైన్ ఇండియా స్కూల్‌లో ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఘనంగా సైన్స్ ఎక్స్పోని నిర్వహించారు.

దిశ, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరం రాపర్తినగర్‌లోని షైన్ ఇండియా స్కూల్‌లో ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఘనంగా సైన్స్ ఎక్స్పోని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఖమ్మం నగర మేయర్ పునకొల్లు నీరజ, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, ఖమ్మం జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుర్రం కాంతారావు, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మేదరమెట్ల అనిల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మేయర్ పునకొల్లు నీరజ మాట్లాడుతూ.. ఇలాంటి సైన్స్ ఎక్స్పోలు పిల్లలలో అంతర్గతంగా దాగివున్న నైపుణ్యాలను, సృజనత్మాకతను పెంపొందిస్థాయని తద్వారా వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని పేర్కొన్నారు. పాఠశాలలో చదువుతున్న 335 మంది విద్యార్థులు తాము రూపొందించిన ప్రాజెక్ట్‌లను ప్రదర్శించి వాటి ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో షైన్ ఇండియా స్కూల్ చైర్మన్ తాళ్లూరి సృజన్ కుమార్, కరస్పాండెంట్ తాళ్లూరి ఉషారాణి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ప్రాజెక్ట్‌లను సందర్శించి రేటింగ్ ఇవ్వడం గమనార్హం.






