- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు ఉపయోగపడని పాఠశాల భవనం.. రూ. 5 లక్షలు వ్యర్థం
పినపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో దాదాపు రూ.5 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది.

దిశ, పినపాక: పినపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో దాదాపు రూ.5 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. వివరాలలోకి వెళితే... గోపాలరావుపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం పాతది కావడంతో భవనం పైకప్పు పెచ్చులుడుతూ, భవనం పగుల్లనుంచి పాములు, తేళ్ళు దర్శనమిస్తుండడంతో వార్త పత్రికలలో వచ్చిన కథనాల ఆధారంగా అప్పటి బీఆర్ఎస్ శాసనసభ్యులు రేగా కాంతరావు స్పందించారు. రూ.5 లక్షలతో ఎంపీటీసీ నిధుల నుండి భవనం నిర్మించారు. నిర్మాణం పూర్తి కాకుండానే అధికారుల కక్కుర్తితో కాంట్రాక్టర్ల బిల్లులు కాజేశారు. కనీసం ఫ్లోరింగ్ చేయించినా వాడుకలోకి తెచ్చుకుంటామని పలుమార్లు ఉపాధ్యాయులు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాధుడే లేడు. ఆరేడు సంవత్సరాల నుండి మొరపెట్టుకున్నా పట్టించుకున్న ఎంపీడీఓ లేడు, విద్యాశాఖాధికారీ లేడు. ఈ విద్యాసంవత్సరమైన పాఠశాల భవనాన్ని పూర్తి చేసి తరగతులు జరిగేలా చూడాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ప్రజలు కోరుకుంటున్నారు.






