- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏన్కూర్‌లో నకిలీ సరుకులు అమ్మకాలు..
వ్యాపారులు గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు.

దిశ, ఏన్కూర్: హైదరాబాదు లాంటి ఎక్కడో సుదూర ప్రాంతాలలో ఒరిజినల్ వస్తువులు పోలిన నకిలీ వస్తువులు అమ్ముతున్నారంటే నమ్మడానికి అవకాశంగా ఉండేది. ఇప్పుడు పల్లె ప్రాంతాలకు నకిలీ వస్తువుల అమ్మకాలు జోరు ఊపందుకొనడంతో అమాయక గిరిజన ప్రజల డబ్బును ఈ ప్రాంత వ్యాపారులు కొల్లగొడుతున్నారు. మండల కేంద్రంలో మొదలుకొని వివిధ గ్రామాల్లో ఒరిజినల్ వస్తువులకు మించిన నకిలీ వస్తువులు అమ్మకాలు చేసుకొని వ్యాపారులు డబ్బులు దండుకోవటంతో ప్రజలు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నిత్యవసర వస్తువులు మొదలుకొని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌తో పాటు మొబైల్, ఇతర వస్తువులు మండలంలో మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. షాపులపై అజమాయిషి చేయవలసిన క్వాలిటీ కంట్రోల్ అధికారులు కన్నెత్తి కూడా చూడట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా చిన్నపాటి అక్షరం మిస్టిక్తో నకిలీ వస్తువులు ఒరిజినల్ వస్తువులను చెప్పి ప్రజలకు అంటగట్టడం జరుగుతుంది. లాభాల కోసం వ్యాపారులు చేసే వికృత చేష్టలకు ప్రజలు బలవుతున్నారు. ప్రభుత్వం నకిలీ వస్తువులపై కొరడా రులిపించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు ముడుపులకు అలవాటు పడి ఆఫీస్ నుండి బయటికి వచ్చి షాపులపై దాడులు చేసిన సందర్భాలు కనబడట్లేదని ప్రజలు బహిరంగ విమర్శిస్తున్నారు. ఒరిజినల్ వస్తువుల మాటున నకిలీ వస్తువుల అమ్మకాలు జరిపే షాపులపై దాడులు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.






