- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు

దిశ,టేకులపల్లి: బతుకమ్మ వేడుకల్లో చివరి రోజున ‘సద్దుల బతుకమ్మ’ లేదా ‘పెద్ద బతుకమ్మ’గా గౌరమ్మను ఆరాధిస్తారు. ఈ ఏడాది ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) తిథి సోమ, మంగళవారాల్లో ఉండడడంతో కొన్ని ప్రాంతాల్లో సోమవారం సద్దుల బతుకమ్మను నిర్వహించారు. ఈ సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద పళ్ళెంలో గుమ్మడి ఆకులు, రంగులు అద్దిన గునుగు పూలు, తంగేడు, ఇతర రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు.
సద్దులను నైవేద్యం పెట్టి, పూజలు చేస్తారు. అనంతరం రాత్రి వరకూ ఆటపాటలతో అమ్మవారిని కొలిచి, బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.పూలపండుగతో టేకులపల్లి కళకళలాడుతోంది. మండలంలో ఎక్కడ విన్న బతుకమ్మ పాటలే. తీరొక్క పువ్వులతో పేర్చే బతుకమ్మ సంబురాలతో మండలంలో సందడి నెలకొంది. తొమ్మిది రోజులు జరిగే... బతుకమ్మ పండుగలో రోజుకో ప్రత్యేకత ఉంటుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మ గా నిలిచే బతకమ్మ పండుగలో చివరి ఘట్టమైన సద్దుల బతుకమ్మ నేడు. చివరిరోజు సద్దుల బతుకమ్మ... సందడి అంతా ఆ రోజే కనిపిస్తుంది.ఊరూవాడలు పూలవనాలుగా మారాయి. వాడవాడలా పూలపండుగ సంబరాలు జరుగుతున్నాయి. పెత్రామాస నుంచి దుర్గాష్టమి వరకు తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తూ.. మహిళలు ఆడుతారు. బతుకమ్మ వేడుకల్లో ప్రతి రోజూ.. ఓ ప్రత్యేకత. రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మ తల్లికి సమర్పిస్తారు.
తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ అంటే.. ఇక ఆ సందడే వేరు. బతుకమ్మ పండుగలో భాగంగా చివరి రోజైన సద్దుల బతుకమ్మతో పండుగ ముగియనుంది. 9వ రోజు సద్దుల బతుకమ్మను నిర్వహించే మహిళలు 9 అంతరాలుగా బతుకమ్మను పేర్చనున్నారు. తంగేడు, గునుగు, కట్ల, బంతి, చామంతి, సీతజడలు వంటి పూలతో రోడ్లు పూలవనంలా మారాయి.సద్దుల బతుకమ్మకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాట్లను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళా మణులు ఆనందోత్సవాలతో బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు.ఈ కార్యక్రమంలో కోయగూడెం మాజీ సర్పంచ్ కోరం ఉమా,ఇస్లావత్ రెడ్డి నాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్ నాయక్, గుడి పూడి సత్యనారాయణ గ్రామ పెద్దలు గ్రామస్తులు, మహిళా మణులు పాల్గొన్నారు.






