ఇల్లందులో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

by S Gopi |

ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తున్న ఇల్లందు పట్టణం రెండో వార్డు ఇల్లందులపాడుకు చెందిన... RTC driver commits suicide

ఇల్లందులో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
X

దిశ, ఇల్లందు: ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తున్న ఇల్లందు పట్టణం రెండో వార్డు ఇల్లందులపాడుకు చెందిన రాతారపు రానా(46) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. రాతారపు రానా ఆర్టీసీ డ్రైవర్ గా భద్రాచలం డిపోలో విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలం క్రితం రానాను హైదరాబాద్ డిపోకు ట్రాన్స్ ఫార్ చేయడం వలన అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ కలహాల వలన మనస్తాపం చెంది ఇంటి వద్ద రాత్రి ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించగా మృతిచెందాడని విషయం తెలిపారు. అతనికి భార్య మల్లేశ్వరి (43), కుమారుడు నవీన్ కుమార్ (21), కూతురు సారిక (19) లు ఉన్నారు.

Next Story