సంక్రాంతి కి ముందే 'కోడి' కూత..!

by Ratna Kumari |

దిశ, ​బూర్గంపాడు : సంక్రాంతి పండుగకు దాదాపు 14 రోజుల సమయం ఉంది. అయిన‌ప్ప‌టికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలంలో అప్పుడే కోడి పందాలు వేసేందుకు సిద్ధమ‌య్యారు.

సంక్రాంతి కి ముందే కోడి కూత..!
X

దిశ, ​బూర్గంపాడు : సంక్రాంతి పండుగకు దాదాపు 14 రోజుల సమయం ఉంది. అయిన‌ప్ప‌టికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలంలో అప్పుడే కోడి పందాలు వేసేందుకు సిద్ధమ‌య్యారు. వాస్త‌వానికి నిబంధనలకు విరుద్ధంగా పోలీసుల కళ్లు గప్పి కొన్ని ముఠాలు బహిరంగంగానే కోడి పందాలను నిర్వహిస్తుండటంతో స్థానికంగా కలకలం రేపుతోంది.​ మండల కేంద్రంతోపాటు ​సారపాక, మోరంపల్లి, బంజర, ​సోంపల్లి ప్రాంతాల్లోని తోటలు, నిర్మానుష్య ప్రదేశాలను నిర్వాహకులు తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. కేవలం స్థానికులే కాకుండా పక్క మండలాల నుంచి కూడా పందెం వేసే వాళ్లు ఇక్కడికి వ‌స్తున్న‌ట్టు స‌మాచారం.

​లక్షల్లో పందాలు.. జేబులు గుల్ల!

ఒక్కో పందెంపై కనిష్టంగా రూ.10 వేల నుంచి గరిష్టంగా లక్ష రూపాయ‌ల వరకు బెట్టింగ్‌లు సాగుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజుకు లక్షల రూపాయలు చేతులు మారుతుండటంతో, సామాన్య ప్రజలు ఈ జూదానికి అలవాటు పడి తమ సంపాదనను పోగొట్టుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ స‌మీపిస్తుండ‌టంతో ఈ పందాలు మరింత ముదిరే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పందాల వల్ల గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, గొడవలు జరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, కోడి పందాల స్థావరాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Next Story