- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు
శుక్రవారం రాత్రి 07:00 to 21:00 గంటల వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఉత్తర్వులు మేరకు ఎరైవ్ ఎలైవ్ ప్రోగ్రాంలో (రోడ్డు భద్రత వారోత్సవాలు) భాగంగా టేకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 9వ మైల్ తండా గ్రామంలో పోలీస్ కళాబృందంచే సేఫ్టీ డ్రైవింగ్‌లో తీసుకోవలసిన రక్షణ చర్యలు తెలిపే విధంగా నాటిక రూపంలో ప్రదర్శన చేయడం జరిగింది.

దిశ, టేకులపల్లి: శుక్రవారం రాత్రి 07:00 to 21:00 గంటల వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఉత్తర్వులు మేరకు ఎరైవ్ ఎలైవ్ ప్రోగ్రాంలో (రోడ్డు భద్రత వారోత్సవాలు) భాగంగా టేకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 9వ మైల్ తండా గ్రామంలో పోలీస్ కళాబృందంచే సేఫ్టీ డ్రైవింగ్‌లో తీసుకోవలసిన రక్షణ చర్యలు తెలిపే విధంగా నాటిక రూపంలో ప్రదర్శన చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రదర్శనలో సేఫ్టీ డ్రైవింగ్, సైబర్ క్రైమ్, గంజాయి మత్తు పదార్ధాలకు ఏ విధంగా దూరంగా ఉండాలి అని నాటిక రూపంలో ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఎస్పీ వెంకన్న బాబు మాట్లాడుతూ.. భద్రత నియమాలు పాటిస్తూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలను నివారించవచ్చునని తెలిపారు.
టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సై రాజేందర్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగం, సీటు బెల్టు ప్రాధాన్యత, డిఫెన్స్ యు డ్రైవింగ్ నియమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు సబ్ డివిజన్ పోలీస్ అధికారి వెంకన్న బాబు, టేకులపల్లి సీఐ సత్యనారాయణ, టేకులపల్లి ఎస్సై రాజేందర్, కళాబృందం ఇంచార్జ్ క్రిస్టఫర్, సిబ్బంది రామస్వామి, శ్రీను, బాలు విజయ్ జాన్ హాజరై కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తొమ్మిదవ మైల్ తండా సర్పంచ్ బానోత్ పూర్ణ, బానోత్ బద్రు, గ్రామ పెద్దలు, పలువురు పాల్గొన్నారు.






