- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడకు బస్సు సౌకర్యం కల్పించండి ఆర్‌ఎం సార్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నేరుగా వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దిశ, ఏన్కూర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నేరుగా వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విజయవాడకు వెళ్లాలంటే మూడు బస్సులు మారాల్సి వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం నుంచి వయా ఏన్కూర్, తల్లాడ, కల్లూరు, తిరువూరు మీదుగా విజయవాడకు బాపట్ల, గుడివాడ, రేపల్లె ప్రాంతాలకు బస్సులు నడిచేవి. ప్రస్తుతం ఆ బస్సులు ఈ మార్గంలో నడవడం లేదు.
ఈ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్‌తో కుటుంబ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు వ్యాపార అవసరాల కోసం తరచూ వెళ్లాల్సి వస్తోంది. పత్తి, మిర్చి వ్యాపారులు ఆర్థిక లావాదేవీల కోసం ప్రయాణించాల్సి ఉన్నప్పటికీ, బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా, విద్యార్థులు ఉన్నత విద్య కోసం విజయవాడ వంటి పట్టణాలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారిని చూడటానికి తల్లిదండ్రులు వెళ్లాలంటే మూడు బస్సులు మారాల్సిన పరిస్థితి నెలకొంది. కాబట్టి కొత్తగూడెం డిపో నుంచి వయా తల్లాడ మీదుగా విజయవాడకు నేరుగా బస్సు సౌకర్యం కల్పించాలని ఖమ్మం జిల్లా ఆర్‌ఎంని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.






