- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెరుగుతున్న పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం
by Sridhar Babu |
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు రిజర్వాయర్ కు అధికారులు నాగార్జునసాగర్ నీటిని విడుదల చేయడంతో జలాశయం నీటి మట్టం స్వల్పంగా పెరిగింది.

X
దిశ, కూసుమంచి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు రిజర్వాయర్ కు అధికారులు నాగార్జునసాగర్ నీటిని విడుదల చేయడంతో జలాశయం నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. జలాశయం గరిష్ట నీటిమట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 19 అడుగుల నీరు నిల్వ ఉంది.
మొదటి జోన్ నుంచి 1568 క్యూసెక్కులు, పాలేరు పరీవాహక ప్రాంతం నుంచి 2012 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. పాలేరు జలాశయం నుంచి ఎడమ కాల్వ రెండో జోన్ ఆయకట్టుకు 2810, పాత కాల్వకు 120 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.
- Tags
- Paleru Reservoir
Next Story






