ప‌క్క‌దారి ప‌డుతున్న రేష‌న్ బియ్యం

by Ratna Kumari |

దిశ, ఆళ్లపల్లి : మండ‌ల ప‌రిధిలో రేష‌న్ బియ్యం ప‌క్క దారి ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌ధానంగా రూ.10 నుంచి రూ.15 వ‌ర‌కు కొనుగోలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇదే అదునుగా ఏజెన్సీ ప్రాంతమైన

ప‌క్క‌దారి ప‌డుతున్న రేష‌న్ బియ్యం
X

దిశ, ఆళ్లపల్లి : మండ‌ల ప‌రిధిలో రేష‌న్ బియ్యం ప‌క్క దారి ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌ధానంగా రూ.10 నుంచి రూ.15 వ‌ర‌కు కొనుగోలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇదే అదునుగా ఏజెన్సీ ప్రాంతమైన ఆళ్లపల్లి మండలంలో గ్రామాలలో రేషన్ మాఫియా తిరుగుతూ ఒక చోట రేషన్ బియ్యాన్ని స్టోరేజ్ చేసి బొలెరో, ఆటోలలో, అర్ధరాత్రి సమయాల్లో తరలిస్తున్నట్లు మండల వాసులు గుసగుసలాడుతున్నారు. నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ మాఫియా ఆరు కాయలు.. మూడు పువ్వుల్లాగా వారి వ్యాపారం కొనసాగిస్తూ, లక్షలు గడిస్తున్నారు. రేషన్ షాప్ లో బియ్యం తీసుకోవడమే తరువాయి, మరుసటి రోజు నుంచి లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి కొనుగోలు చేస్తున్నట్లు స‌మాచారం. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు రేషన్ మాఫియా బియ్యం తరలించడానికి రెడీగా ఉంటారని తెలుస్తోంది. వాస్త‌వానికి రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది చట్ట విరుద్ధం. పేదలకు సరఫరా చేయాల్సిన బియ్యాన్ని తరలించడం నేరం. నిలువ చేసిన బియ్యాన్ని ఆటోలు, మినీ వ్యాన్లు, బొలెరో వాహనాలలో వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ రవాణాలను అడ్డుకట్ట వేయాల్సిందిగా మండల వాసులు కోరుకుంటున్నారు.

Next Story