ప్రభుత్వ పాఠశాలలో ఆకతాయిల అరాచకం..

by Kodari Anjali |

ఖమ్మం పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆకతాయిలు మద్యం సేవించి బీరు సీసాలను పగులగొట్టడం ఏంటని యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మండిపడ్డారు.

ప్రభుత్వ పాఠశాలలో ఆకతాయిల అరాచకం..
X

దిశ, ఖమ్మం బ్యూరో: ఖమ్మం పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆకతాయిలు మద్యం సేవించి బీరు సీసాలను తరగతి గదులు, కార్యాలయ గదుల్లోకి విసిరివేయడం తీవ్ర ఆందోళనకరమని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి బొట్ల సాగర్ పేర్కొన్నారు. పాఠశాలల భద్రత, పర్యవేక్షణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి అసాంఘిక ఘటనలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఘటనపై అర్బన్ ఎంఈఓను సంప్రదించినా స్పందించకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. పాఠశాలల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ఖమ్మం అర్బన్ ఎంఈఓపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని యుఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. అలాగే పాఠశాలల పరిసరాల్లో అసాంఘిక శక్తుల సంచారాన్ని అరికట్టేందుకు పోలీసు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కోరింది.

Next Story