- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామాలయం కొత్త ఈవో రమాదేవి బాధ్యతల స్వీకారం
by samatah |
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఇన్‌చార్జి ఈవోగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్. రమాదేవి గురువారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆమె భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు.

X
దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఇన్‌చార్జి ఈవోగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్. రమాదేవి గురువారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆమె భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన కొత్త ఈవోకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఉపాలయంలో వేద పండితులచే ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో భద్రాద్రి ఆలయ ఇంచార్జ్ ఈవో బాధ్యతలు స్వీకరించారు.
Next Story






