- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏన్కూర్‌లో రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు..
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన సేవలు అమోఘమని కాంగ్రెస్ శ్రేణులు కొనియాడారు.

దిశ, ఏన్కూర్: స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన సేవలు అమోఘమని కాంగ్రెస్ శ్రేణులు కొనియాడారు. మంగళవారం మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను నిర్వహించి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని వారు పేర్కొన్నారు. పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్, వైద్యం కోసం పేదలు ఇబ్బంది పడకుండా ఆరోగ్య శ్రీ పథకం, 108 వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు సేవలు అందించారని పలువురు కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గార్ల ఓడ్డు సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు స్వర్ణ నరేందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా లాలు, మాజీ ఎంపీటీసీ మేడా ధర్మారావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు వేముల కృష్ణ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు భూక్య చందులాల్, మజీద్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రభావతీ రెడ్డి, జెర్రిపోతుల సుందరం, మాజీ ఎంపీటీసీ లచ్చిరాం నాయక్, లెనిన్, నాగరాజు, వాసిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.






