- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని, సమాజంలో అవినీతి వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా రాసే హక్కు జర్నలిస్టులకు ఉం

దిశ, ఖమ్మం రూరల్ : జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని, సమాజంలో అవినీతి వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా రాసే హక్కు జర్నలిస్టులకు ఉందని ఆ హక్కును కాలరాసే హక్కు ఏ శక్తులకు లేదని సీపీఐ 28వ డివిజన్ సెక్రెటరీ బియ్యాల రాజు అన్నారు. వార్తలొస్తే వారి చేతులు కాళ్లు నరికేస్తామని కొంతమంది కుసంస్కారహీనులు మాట్లాడిన తీరును పలువురు మేధావులు, రాజకీయ పార్టీలు నాయకులతో పాటు అధికారులు సైతం ఖండిస్తున్నారు. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ నందు సిపిఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులపై వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా నిర్వహించారు.
‘మీడియా స్వేచ్ఛను హరించడాన్ని , ప్రతి ఒక్కరు ఖండించాలని బియ్యాల రాజు అన్నారు. సమాజంలో జర్నలిస్టులకు నాలుగవ స్థానం ఉందని అటువంటి స్థానం ఉన్న విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కొత్త తరహా విధానానికి దారితీస్తుందని ఆయన విమర్శించారు. ‘విలేకరుల హక్కులకు రక్షణ కల్పించాలి’ ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన లో ఏఐవైఎఫ్ యువజన సంఘం 28,29,30వ డివిజన్ నాయకులు మిరియాల నరుణ్ తేజ్, అక్కినపల్లి దేవయ్య, పానమాకుల కృపాకర్, యువజన సంఘం సభ్యులు హనే, టేకుమట్ల ప్రభాకర్, బాబి, నాగేంద్రబాబు, సంపత్, సిపిఐ సోషల్ మీడియా ఇంచార్జ్ రెబ్బగొండ్ల గోపి తదితరులు ఉన్నారు.






