ఏదులాపురం సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

by Naga Rani Yarlagadda |

ఏదులాపురం సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75కోట్లు నిధులు మంజూరు చేసింది.

ఏదులాపురం సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
X

దిశ, ఖమ్మం రూరల్: ఏదులాపురం సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75కోట్లు నిధులు మంజూరు చేసింది. ఇప్పటివరకు పరిమిత వనరులతో అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతున్న ఈ మున్సిపాలిటీకి ఇప్పుడు భారీ ఊతం లభించింది. ఈ నిధుల మంజూరులో మంత్రి పొంగులేటి కీలక పాత్ర పోషించారని అధికారులు, కౌన్సిలర్లు చెబుతున్నారు. పల్లె వాతావరణం ఉన్న ఈ ప్రాంతం ఇక పట్టణ వాతవరణంలా మారేందుకు ఈ నిధులు దోహదపడనున్నాయి. రోడ్లు, డ్రైనేజీ, అంతర్గత రహదారులు, నర్సరీలు, పారిశుధ్యం వంటి పనులు ఊపందుకోనున్నాయి. పనులు దశలవారీగా అమలు చేస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏదులాపురం సమగ్రాభివృద్ధి కోసం రూ.75కోట్లు నిధులు మంజూరు చేసింది. ఇప్పటివరకు పరిమిత వనరులతో అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతున్న ఈ మున్సిపాలిటీకి ఇప్పుడు భారీ ఊతం లభించింది. ఈ నిధుల మంజూరులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించారని అధికారులు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలంలో ఉన్న పది పంచాయతీలను కలిపి ఏదులాపురం మున్సిపాలిటీగా రూపొందించి ఇటీవలే ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. నూతన మున్సిపాలిటీకి నిధుల సమీకరించడంలో పాలేరు నుంచి శాసనసభ సభ్యునిగా ప్రతినిధ్యం వహిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి విశేషంగా కృషి చేశారు. పల్లె వాతావరణం ఉన్న ఈ ప్రాంతం ఇక పట్టణ వాతవరణంలా మారేందుకు ఈ నిధులు దొహదపడుతాయని కౌన్సిలర్లు అభిప్రాయపడుతున్నారు.

చేపట్టబోయే పనులు ఇవే

రూ.75 కోట్లతో చేపట్టబోయే పనుల్లో ప్రధానంగా రూ.35కోట్లతో సీసీ రోడ్లు, రూ.10కోట్లతో డ్రైనేజీలు, రూ.5కోట్లతో పార్కులు, రూ.50లక్షలతో సైన్ బోర్డ్స్, రూ.4. 12కోట్లతో రహదారులను శుభ్రపరిచే యంత్రం, ఆటోలు, డీఆర్సీసీ భవనాలు, శానిటేషన్ మెటిరియల్స్ నిర్మాణం కోసం, రూ.5. 35 కోట్లతో రెండు రైతుబజార్లు, జీమ్‌లు, నర్సరీల నిర్వహణ, స్టోర్ రూమ్, ఎవెన్యూ ప్లాంటేషన్ల కోసం కేటాయించారు. వీటితో పాటు అంతర్గత రహదారుల విస్తరణ, సిమెంట్ రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థ పునర్నిర్మాణం, ఆధునిక తాగునీటి పైపులైన్ వ్యవస్థ ఏర్పాటు కానున్నాయి. కాలనీల్లో వీధి దీపాలు, పార్కులు, పచ్చదనం అభివృద్ధి, చెత్త నిర్వహణకు ఆధునిక పద్ధతులు అమలు చేయనున్నారు. మున్సిపాలిటీని శుభ్రంగా, సక్రమంగా ఉంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకంగా యువత, మహిళలకు ఉపయోగపడేలా కమ్యూనిటీ హాల్స్, క్రీడా మైదానాలు అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించే చర్యలు చేపట్టే అవకాశముంది. ఈ పనులు దశలవారీగా అమలు చేయబడతాయని మున్సిపల్ అధికారులు తెలిపారు.

మున్సిపల్ అభివృద్ధి శ్రీకారం: ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృషితో విడుదలైన రూ.75కోట్లు ఏదులాపురం మున్సిపల్ అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లే. పెద్ద మొత్తంలో నిధులు విడుదల కావడంతో మంత్రి సూచనల మేరకు కేటాయింపులు జరుగుతున్నాయి. టెండర్ ద్వారా పనులు కేటాయించి, ప్రారంభిస్తాం.

మంత్రి పొంగులేటికి కృతజ్క్షతలు : పోకబత్తిని అనిత, ఏదులాపురం చైర్‌పర్సన్

నూతనంగా ఏర్సడిన మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.75కోట్లు నిధులు విడుదల చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ ప్రజల తరపున కృతజ్క్షతలు. నూతనంగా ఏర్పడిన ఈ పురపాలకంలో రూపురేఖలు మారడంతో పాటు చిరస్థాయిలో నిలిచేపోయే పనులు చేసేందుకు శ్రీకారం చుడుతున్నాం.

అభివృద్ధి అంటేనే మంత్రి పొంగులేటి : తమ్మినేని నవీన్, ఏదులాపురం వైస్ చైర్మన్

అభివృద్ధి అంటేనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి., నియోజకవర్గంతో పాటు మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడం హర్షించదగ్గ విషయం. అన్నమాట నిలబెట్టుకునే నాయకుడు ఒక్క పొంగులేటి మాత్రమే. రాజకీయాలకతీతంగా నిధులు కేటాయింపులు జరగాలని మంత్రి ఆదేశించారు. రాబోయే ఏడాది కాలంలో రూపురేఖలు మారడంతో పాటు మున్సిపల్‌కు ఆదాయం పెరుగుతుంది.

Next Story