- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూసుమంచిలో రాజకీయ చిచ్చు..
కూసుమంచి మండలం ముత్యాలగూడెంలో గత మూడురోజుల క్రితం గౌడల కులదైవం కంఠ మహేశ్వర స్వామి గుడి ప్రారంభం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో జరిగిన చిన్నగొడవ చిలికిచిలికి గాలి వానలా మారింది.

దిశ, కూసుమంచి : కూసుమంచి మండలం ముత్యాలగూడెంలో గత మూడురోజుల క్రితం గౌడల కులదైవం కంఠ మహేశ్వర స్వామి గుడి ప్రారంభం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో జరిగిన చిన్నగొడవ చిలికిచిలికి గాలి వానలా మారింది. దీంతో రెండు వర్గాల వారు పోటాపోటీగా ప్రెస్మీట్లు పెట్టి ఒకరి పై ఒకరు దూషణలకు దిగి రాజకీయ కాక పుట్టిస్తున్నారు.
శనివారం రాత్రి ముత్యాలగూడెం గ్రామంలో కంఠమహేశ్వర స్వామి గుడి ప్రాంరంభం సందర్భంగా ఆరోజు రాత్రి ఎమ్మెల్యే గ్రామంలో ర్యాలీ నిర్వహించగా ఆ సమయంలోనే స్థానిక కాంగ్రెస్ పార్టీ వాళ్ళుకూడా ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఒకరికొకరు ఎదురుపడి చిన్నపాటి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు ఎమ్మెల్యే కారు పై రాళ్లు విసరడంతో పరిస్థితి విషమించడం దాంతో నిన్నటి నుంచి ఇరువర్గాలు ఒకరి పై ఒకరు పొటా పోటీగా ప్రెస్మిట్లు పెట్టి దూషణలకు దిగి రాజకీయ కాక పుట్టిస్తున్నారు.






