- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇళ్ల ఫొటోల అప్ లోడ్ ను త్వరితగతిన చేపట్టండి
వైరా మున్సిపాలిటీ పరిధిలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ఫొటోలను తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేసే ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని వైరా మున్సిపాలిటీ కమిషనర్ యూ. గురులింగంను జిల్లా అడిషనల్ కలెక్టర్, వైరా మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి శ్రీజ ఆదేశించారు.

దిశ ఎఫెక్ట్..
ఇందిరమ్మ ఇళ్ల ఫొటోల అప్ లోడ్ ను త్వరితగతిన చేపట్టండి
- మున్సిపల్ కమిషనర్ కు అడిషనల్ కలెక్టర్ ఆదేశం
- డిప్యూటేషన్ పై వార్డ్ ఆఫీసర్లను నియమించాలని కమిషనర్ విజ్ఞప్తి
దిశ, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ఫొటోలను తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేసే ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని వైరా మున్సిపాలిటీ కమిషనర్ యూ. గురులింగంను జిల్లా అడిషనల్ కలెక్టర్, వైరా మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి శ్రీజ ఆదేశించారు. సోమవారం దిశ వెబ్ సైట్ లో, మంగళవారం దిశ దినపత్రికలో "ఇందిరమ్మ ఇండ్లకు బిల్లుల కష్టాలు" అనే వార్త కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అడిషనల్ కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల అప్లోడ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొణిజర్ల మండలంలోని పల్లిపాడు గ్రామంలో వైరా మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ కోసం అవసరమైన స్థలాన్ని మంగళవారం అడిషనల్ కలెక్టర్ శ్రీజ పరిశీలించారు. ఈ సమయంలో మున్సిపాలిటీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ఫొటోల అప్లోడ్ గురించి కమిషనర్ ను ఆమె ప్రశ్నించారు. వార్డు ఆఫీసర్లు బదిలీ కావడంతో ఇళ్ల ఫొటోల అప్లోడ్ ప్రక్రియ నిలిచిపోయిందని కమిషనర్ వివరించారు. ఖమ్మం కార్పొరేషన్ నుంచి వార్డు ఆఫీసర్లను డిప్యూటేషన్ పై వైరా మున్సిపాలిటీ కేటాయించాలని కమిషనర్ కలెక్టర్ ను కోరారు. ఇదిలా ఉంటే సోమవారం దిశ వెబ్సైట్లో వార్త కథనం ప్రచురించిన తర్వాత కమిషనర్ వార్డు ఆఫీసర్లను కేటాయించాలని కోరుతూ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.






