- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి కల్పించండి సార్.. పాప, భర్తకు అనారోగ్యం
సుజాతనగర్ మండలానికి చెందిన సానపూరి సౌమ్య అనే మహిళ తన భర్త, పాప అనారోగ్య ఖర్చులకు నెలకు రూ.15వేలు అవుతుందని ప్రభుత్వాన్ని జాబ్ పరంగా సాయం కోరింది.

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: తన భర్త, పాప అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారి ఆసుపత్రుల ఖర్చులకు నెలకు రూ. 15 ఖర్చులు అవుతున్నాయని ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ను వేడుకుంది సుజాతనగర్ మండలానికి చెందిన సానపూరి సౌమ్య. సుజాతనగర్ మండలం ఉప్పరిగూడెంకు చెందిన మాలోత్ ప్రేమ కుమార్, సానపురి సౌమ్య ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత నాలుగేళ్లకు భర్తకు ఆక్సిడెంట్ అవడం.. ఆ సమయంలో నిండు గర్భిణీగా ఉన్న సౌమ్య బిడ్డకు జన్మనివ్వడం జరిగిపోయాయి. అటు భర్త, ఇటు పాప ఆలనా పాలన చూసుకునేవారు లేక సతమతమైంది. మూడు నెలల తర్వాత పాపను ఆసుపత్రికి తీసుకువెళ్తే గుండెలో రంధ్రం, బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టి ఉందని వైద్యులు తెలిపారు. ఇక అప్పటి నుంచి నెలకు రూ.15 వేల ఖర్చు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతీ రెండు నెలలకు స్కానింగ్ , 2డీ ఎకో చేయించడం కోసం అప్పులు చేస్తూ పాపను బతికించుకుంటున్నామని వివరించింది. ప్రస్తుతం ఫిట్స్ కూడా వస్తుందని అటు భర్త అనారోగ్యం, ఇటు పాపకు నెల నెల ఆసుపత్రి ఖర్చులు, ఇంటి అద్దె భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేసింది. బీటెక్ విద్యనభ్యసించిన తనకు ఏదైనా ఉపాధి కానీ ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరింది.






