- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోండా ఉమా ఎపిసోడ్‌పై చంద్రబాబు సీరియస్.. విచారణకు త్రీమెన్ కమిటీ ఏర్పాటు
by Vemula.Srinu Prasad |
టీడీపీ నేత బోండా ఉమా వ్యవహారం ఆ పార్టీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గుంటూరులో నిర్వహించిన ముద్రగడ సంస్మరణ సభలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి కూర్చోవడం, సన్నిహితంగా మెలగడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి...

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేత బోండా ఉమా వ్యవహారం ఆ పార్టీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గుంటూరులో నిర్వహించిన ‘ముద్రగడ సంస్మరణ సభ’లో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి కూర్చోవడం, సన్నిహితంగా మెలగడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో బోండా ఉమా వ్యవహారం, పార్టీ ప్రతిష్టపై ఎఫెక్ట్ పడింది. దీంతో ఈ అంశం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. బోండా వ్యవహారంపై విచారణకు త్రీమెన్ కమిటీని నియమించారు. ఇందులో సభ్యులుగా పల్లా శ్రీనివాస్‌తో పాటు కిలారు రాజేష్, నిమ్మల రామానాయుడితో త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేశారు. మంగళవారం పార్టీ కేంద్రకార్యాలయానికి రావాలని బోండా ఉమాకు పిలుపునిచ్చారు. అంబటితో కలిసి వేదిక పంచుకోవడంపై విచారణ ఇవ్వాలని సూచించారు.
Next Story






