తప్పని గ్యాస్ తిప్పలు.. ఏజెన్సీ ఎదుట బారులు

by Batti.Sumithra |

వంట గ్యాస్ బుకింగ్, సరఫరాల్లో ఏర్పడుతున్న సాంకేతిక చిక్కులు వినియోగదారులను గందరగోళాన్ని గురిచేస్తున్నాయి.

తప్పని గ్యాస్ తిప్పలు.. ఏజెన్సీ ఎదుట బారులు
X

దిశ, తల్లాడ : వంట గ్యాస్ కోసం తంటాలు తప్పడం లేదు.. పశ్చిమాసియాలో ఉద్రిక్తల నేపథ్యంలో మన దగ్గర గ్యాస్ కొరత ఏర్పడుతుంది అనే భయాందోళనలకు.. తోడు బుకింగ్ సరఫరాల్లో సాంకేతిక చిక్కులు వినియోగదారులకు గందరగోళాన్ని గురిచేస్తున్నాయి. తల్లాడ మండలంలో వంట గ్యాస్ కోసం హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ఎదుట మంగళవారం భారీగా జనాలు పడిగాపులు కాశారు. తెల్లవారుజామున 6 నుంచి క్యూ కట్టారు. మండుటెండల్లో గ్యాస్ కోసం వేచి ఉన్నారు.

మరోవైపు గ్రామీణ ప్రాంతాలకు సిలిండర్ సరఫరా నిలిపివేయడంతో, అదేవిధంగా హోటల్ కు బ్లాక్ లో గ్యాస్ బండలను విక్రయించడంతో పూర్తిగా గోడౌన్ లో గ్యాస్ లేని పరిస్థితి ఏర్పడింది. వరుసగా పండగల రావడంతో తల్లాడ మండలంలోని ఏజెన్సీ ఎదుట వినియోగదారులు బారులు తీరారు. పల్లెల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు మండుటెండను సైతం లెక్కచేయకుండా లైన్లో నిలబడి సిలిండర్ను కోసం వేసి చూస్తున్నారు. సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికీ, ఏజెన్సీ గేట్లకు తాళాలు వేసి తీయకుండా ఉన్న ఏజెన్సీ సిబ్బంది పై అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఎందుకు సరఫరా చేయడం లేదని నిర్వాహకులు పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు.

Next Story