- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుకు యూరియా ఇవ్వలేని ప్రజా పాలన: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
వైరాగడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు అన్నారు.

దిశ, వైరా: రైతులకు యూరియా ఇవ్వలేని స్థితిలో ప్రజా పాలన జరుగుతుందని రాష్ట్రంలో ఎక్కడైనా రైతు అరిగోస పడకుండా ఉన్నారా..? ఇదేనా కాంగ్రెస్ ప్రజా పాలన అంటూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. సోమవారం వైరాలోని కమ్మవారి కళ్యాణ మండపంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, SIR పై నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సు వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ ఆర్ జె సి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని రైతు భరోసా రైతు బీమా ఇంతవరకు సక్రమంగా ఇచ్చిన పాపాన పోలేదని రైతుకు యూరియా కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వాన్ని ప్రజాపాలన అంటారని నిలదీశారు. అంతేకాకుండా వైరా మున్సిపాలిటీ చైర్పర్సన్ భర్త నోరు దగ్గర పెట్టుకొని ఉండాలని హెచ్చరించారు.
పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు..
ఖమ్మం జిల్లా ఇంచార్జ్ తక్కలపల్లి రవీందర్ మాట్లాడుతూ.. సర్ పేరుతో కాంగ్రెస్ పెద్ద కుట్ర పన్నిందని.. దారిని తిప్పి కట్టేందుకు బూత్ లెవెల్ ఏజెంట్లు ఇంటింటికి తిరిగి ఓటరుకు ఆవశ్యకతను వివరించాలని కోరారు. సమన్వయ కమిటీలు పార్టీకి ఆయువుపట్టు అని అన్నారు. గ్రామాల్లో మళ్లీ కెసిఆర్ రావాలని 100% ప్రజలు కోరుకుంటున్నారని ఆ దిశగా ప్రతి కార్యకర్త పార్టీకి సేవ చేయాలని కోరారు. పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు ఉంటాయని అన్నారు. రాజకీయ నాయకుడే సమాజానికి వైద్యం చేసే వైద్యులని చెడిపోతున్న సమాజానికి రాజకీయ నాయకులు వైద్యం చేయాలని అన్నారు. అనంతరం తాత మధుసూదన్ రావు మాట్లాడుతూ.. వైరా నియోజకవర్గంలో 2029 లో టిఆర్ఎస్ జండా ఎగరటం ఖాయమని ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టిన బిఆర్ఎస్ గెలుపును ఆపలేరని అన్నారు.
ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది..
వైరా ఎమ్మెల్యే కూడా గాలివాటంకు వచ్చినవాడేనని టిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని కొనిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామంలో అభివృద్ధి పనులను అడ్డుకుంటే ఒప్పుకోమని అన్నారు. సిరిపురంలో వైరా ఎమ్మెల్యే బెదిరించిన తలవంచకుండా పోరాడి సర్పంచ్ సాధించుకున్నామని గుర్తు చేశారు. వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రీజియన్ ద్వారా తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుందని.. సర్ వల్ల పశ్చిమ బెంగాల్‌లో 95 లక్షల ఓట్లు గల్లంతయాయని తద్వారా టిఎంసి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిందని అన్నారు. కాంగ్రెస్ పని ముగియపోతుందని ఇప్పటికే సగం సినిమా ప్రజలకు అర్థమైందని అన్నారు. 2029లో టిఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వనమా విశ్వేశ్వరరావు, కట్టా కృష్ణార్జున రావు, లకావత్ గిరిబాబు, బానోత్ మనీషా లక్ష్మి, బానోత్ బాలాజీ నాయక్, బాణాల వెంకటేశ్వరరావు, ముత్యాల సత్యనారాయణ, బొమ్మెర రామ్మూర్తి, లాల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.






