- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టిన డంపింగ్ యార్డ్..
కోహెడ బాదువుల చెరువులో డంపింగ్ యార్డ్‌ను వెంకటేశ్వర పల్లి గ్రామ పరిధిలోగల సర్వే నెంబరు 998లో మార్చాలని ఆదేశించి ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, కోహెడ: కోహెడ బాదువుల చెరువులో డంపింగ్ యార్డ్‌ను వెంకటేశ్వర పల్లి గ్రామ పరిధిలోగల సర్వే నెంబరు 998లో మార్చాలని ఆదేశించి ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం కోహెడ నుండి చెత్త టాక్టర్స్ డంపింగ్ ప్రదేశానికి వెళ్తున్న విషయం వెంకటేశ్వరపల్లి గ్రామస్తులకు తెలిసి రోడ్డుకు అడ్డంగా బయటాయించి నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకొని ఎంత సర్ది చెప్పినా కూడా వినలేదు గ్రామస్తులు చివరకు చెత్త టాక్టర్స్ ను తిరిగి కోహెడకు పంపించారు. వెంకటేశ్వర్ల పల్లి గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో వెళ్లి తాహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. గతంలో కూడా కలెక్టర్‌ను కలిసి వెంకటేశ్వర పల్లె సర్పంచ్ పండుగ శ్రీకాంత్, వార్డు మెంబర్లు డంపింగ్ యార్డ్ గురించి వినతి పత్రం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. కోహెడ ఎన్టీఆర్ కాలనీలో తీవ్ర ఇబ్బందిగా మారిన డంపింగ్ యార్డును ఎట్టకేలకు అధికారులు మరో ప్రాంతానికి ఆదివారం తరలించడంతో తాము దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న దుర్వాసన, ఈగలు, దోమల బెడద, కాలుష్య సమస్యల నుంచి విముక్తి లభించిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.






