- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తుల కొంగు బంగారంగా పెద్దమ్మ తల్లి
కేశవాపురం జగన్నాధపురం గ్రామంలో వెలసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానము (పెద్దమ్మగుడి) ఆదివారం సందర్భంగా అమ్మవారిని

దిశ, పాల్వంచ టౌన్: కేశవాపురం జగన్నాధపురం గ్రామంలో వెలసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానము (పెద్దమ్మగుడి) ఆదివారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేశారు. పౌర్ణమి సందర్భగా చండీ హోమం నిర్వహించారు. చంద్ర గ్రహణం సంద్భంగా దేవాలయం మహానివేదన అనంతరం దేవాలయం ముసివేశారు.
సోమవారం ఉదయం 9 గంటలకు భక్తులకు పునర్దర్శనం ఉంటుంది. దసరా ఉత్సవముల సందర్భంగా ధర్మకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశములో కార్యనిర్వహణాధికారి ఎన్. రజనీకుమారి, దేవస్థాన ధర్మకర్తలమండలి సభ్యులు బాలినేని నాగేశ్వరరావు, ఛైర్మన్ సందుపట్ల రమ్య, చెవుగాని పాపారావు, పెండ్లి రామిరెడ్డి, భూక్యా గిరిప్రసాద్, అడుసుమిల్లి సాయిబాబు, చెరుకూరి శేఖర్ బాబులు భక్తులకు అవసర ఏర్పాట్లు అనగా క్యూలైన్స్, ఉచిత పులిహోర ప్రసాద వితరణ, మంచినీటి వసతి తదితర ఏర్పాట్లను పర్యవేక్షించినారు.






