ఇంటి పన్నులు సకాలంలో చెల్లించండి : మున్సిప‌ల్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, ఖ‌మ్మం రూర‌ల్ : ఏదులాపురం మున్సిపాలిటీ ప్రజలు ఇంటి పన్ను, నీటి పన్ను సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్దికి తోడ్పడాలని

ఇంటి పన్నులు సకాలంలో చెల్లించండి : మున్సిప‌ల్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి
X

దిశ‌, ఖ‌మ్మం రూర‌ల్ : ఏదులాపురం మున్సిపాలిటీ ప్రజలు ఇంటి పన్ను, నీటి పన్ను సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్దికి తోడ్పడాలని కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పన్నులను మున్సిపాలిటీ గుర్తింపు ఉన్న సిబ్బందికి మాత్రమే చెల్లించి ఆన్ లైన్లో రశీదు పొందాలన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఇంటి పన్నులు చెల్లించవచ్చన్నారు. ప్రతి మూడు నెలలకు ఒక సారి చెల్లించాలని, గడువు తేది లోపు చెల్లించి ఫెనాల్టీ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. https: //cdma.cgg.gov.in లో ఆన్ లైన్లో చెల్లించవచ్చన్నారు. ఇంటి పన్నుల పేరుతో సంబంధం లేని వారి నుంచి మీకు వచ్చే తప్పుడు ఫోన్ కాల్స్ కు స్సదించవద్దన్నారు. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నెం. 9515685414కు డయల్ చేయలన్నారు.

Next Story