- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్ణశాల రామాలయం తాత్కాలిక మూసివేత
by velandi.Saikiran |
పర్ణశాల రామాలయం తాత్కాలిక మూసివేయనున్నారు. సెప్టెంబర్ 7వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా పర్ణశాలలోని శ్రీరామ

X
దిశ,దుమ్ముగూడెం : పర్ణశాల రామాలయం తాత్కాలిక మూసివేయనున్నారు. సెప్టెంబర్ 7వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా పర్ణశాలలోని శ్రీరామ ఆలయం మధ్యాహ్నం 1 గంటలకు తాత్కాలికంగా మూసివేయబడనున్నట్లు ఆలయ ఇంచార్జ్ అనిల్ కుమార్ సోమవారం ప్రకటనలో తెలిపారు. గ్రహణం కారణంగా ఆలయంలో ఆ రోజు సాయంత్రం వరకు ఎటువంటి దర్శన లేదా కార్యక్రమాలు జరగవని, మరలా మరుసటి రోజు 8వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ తలుపులు తిరిగి తెరవబడతాయని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలతో పాటు నిత్య ఆరాధన, నైవేద్యం వంటి ఆచారాలు యథావిధిగా నిర్వహించబడతాయన్నారు. ఆ తర్వాత ఉదయం 7:30 గంటల నుండి భక్తులకు శ్రీరామస్వామి దర్శనం కల్పించబడుతుందని ఆలయ ఇంచార్జ్ వెల్లడించారు.
Next Story






