- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది గల్లీ నా... ఆటో గ్యారేజీలకు అడ్డానా..?
దిశ, మణుగూరు : మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శేషగిరి నగర్ సురక్షా బస్టాండ్ ఏరియాలను చూస్తే ఇవి గల్లీలా లేక ఆటో గ్యారేజీలకు అడ్డాల అనే అనుమానాలు వ్యక్తమవుతాయి.

దిశ, మణుగూరు : మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శేషగిరి నగర్ సురక్షా బస్టాండ్ ఏరియాలను చూస్తే ఇవి గల్లీలా లేక ఆటో గ్యారేజీలకు అడ్డాల అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. ముఖ్యంగా సాగర్ వాటర్ సర్వీసింగ్ సెంటర్, చికెన్ మార్కెట్ ఏరియాలో పరిస్థితి అధ్వానంగా ఉంది. నిత్యం రద్దీగా ఉండే శేషగిరి నగర్ గ్రామ వీధుల్లో కొందరు ఆటో గ్యారేజీలను ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాక నడి రోడ్లపై ఆటోలు నిలుపుదల చేసి కనీసం ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా చేస్తున్నారు. నిత్యం ఎంతోమంది తమ పిల్లలను పాఠశాలలకు తీసుకువెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పరిస్థితి. వీరికి ఎన్నిసార్లు గ్రామస్తులు చెప్పినా తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా వాహనాలను రోడ్లపై నిలుపుదల చేస్తున్నారు. అనేకమంది వాహనాలు అడ్డుగా ఉండడంతో గల్లీలో నుంచి ప్రధాన రహదారి మీదకు వచ్చే సమయంలో రోడ్డు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మేము ఇంతే మా రూట్ ఇంతే అన్న చందంగా ఆటో గ్యారేజ్ నిర్వాహకులు తీరు ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, వాహనాల రోడ్లపై నిలుపుదల చేయకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పట్టించుకోని బ్లూకోడ్..
మణుగూరు పట్టణంలో నిత్యం బ్లూ కోడ్ సిబ్బంది రై రై మంటూ సైరన్ తో రోడ్లపై తిరుగుతూ ఉంటారు. చిరు వ్యాపారులు రోడ్లపై వ్యాపారం చేస్తే వారికి వెంటనే ఫైన్లను విధిస్తున్నారు. కానీ ఇలా గ్రామస్తులకు ఇబ్బందులు కలిగించే వారిపై మాత్రం ఎలాంటి చర్యలు ఉండవని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రోడ్లపై ఆటోలు నిలుపుదల చేసి ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.






