OTR గడువు నిర్ణయం సరికాదు : ఏఐవైఎఫ్

by Ratna Kumari |

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా అమ‌లు చేస్తున్న OTR (One Time Registration) కి ఈనెల 25తో తుది గ‌డువుగా నిర్ణ‌యించ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు ఏఐవైఎఫ్ జిల్లా స‌హాయ కార్య‌ద‌ర్శి, సీపీఐ కౌన్సిల‌ర్ మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌నలో పేర్కొన్నారు.

OTR గడువు నిర్ణయం సరికాదు : ఏఐవైఎఫ్
X

దిశ‌, ఖ‌మ్మంరూర‌ల్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా అమ‌లు చేస్తున్న OTR (One Time Registration) కి ఈనెల 25తో తుది గ‌డువుగా నిర్ణ‌యించ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు ఏఐవైఎఫ్ జిల్లా స‌హాయ కార్య‌ద‌ర్శి, సీపీఐ కౌన్సిల‌ర్ మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌నలో పేర్కొన్నారు. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వేలాది నిరుద్యోగ యువ‌త ఈ నిర్ణ‌యంతో న‌ష్ట‌పోయే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిరంతరంగా కొనసాగించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తును పణంగా పెట్టే విధంగా ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు అనుసరించవద్దని హెచ్చరించారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్నిపునరాలోచించకపోతే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు, ధర్నాలు చేపడతామని స్పష్టం చేశారు. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఏప్రిల్ 10, 2026 వ‌ర‌కు గ‌డువు పెంచిన‌ట్టు వెబ్ సైట్ లో పొందుప‌రిచింది.

Next Story