- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్ : పంచాయతీ కార్యదర్శులపై సమగ్ర విచారణకు ఎంపీఓకు ఆదేశాలు
by Taduka Kalyani |
మండలంలోని భాగ్యనగర్ తండా, గంగారం తండా గ్రామ పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై 'దిశ' దినపత్రికలో బుధవారం ప్రచురితమైన కథనాలకు పంచాయతీరాజ్ శాఖ జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ) రాంబాబు స్పందించారు.

X
దిశ,కారేపల్లి: మండలంలోని భాగ్యనగర్ తండా, గంగారం తండా గ్రామ పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై 'దిశ' దినపత్రికలో బుధవారం ప్రచురితమైన కథనాలకు పంచాయతీరాజ్ శాఖ జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ) రాంబాబు స్పందించారు. ఇరు కార్యదర్శుల వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టాలని మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ)కు ఆదేశాలు జారీ చేశారు. భాగ్యనగర్ తండా కార్యదర్శిపై లంచం తీసుకుంటేనే పనులు చేస్తున్నారనే ఆరోపణలు, గంగారం తండా కార్యదర్శి విధులకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అంశాలపై విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని సూచించారు.పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా సేవలందించాలని డిపిఓ రాంబాబు స్పష్టం చేశారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story






