- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి కాలుష్యానికి ఒకరి బలి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ నగర్ కాలనీలో సింగరేణి సైలో బంకర్ కాలుష్యానికి వ్యతిరేకంగా భాదితులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో 15 రోజులుగా పాల్గొన్న వ్యక్తి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.

దిశ,సత్తుపల్లి : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ నగర్ కాలనీలో సింగరేణి సైలో బంకర్ కాలుష్యానికి వ్యతిరేకంగా బాధితులు రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. రిలే నిరాహార దీక్షలో 15 రోజులుగా పాల్గొన్న వ్యక్తి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. అనంతరం అపస్మారక స్థితి లోకి వెళ్లిన పిల్లి లక్ష్మీనారాయణ (40) గత కొంతకాలంగా ఖమ్మం ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది గురువారం సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురికాగా..వి.యం. బంజర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు. మా ప్రాణాలు బలిగొంటున్న సింగరేణి సైలో బంకర్ తీసివేయ్యాలని 26 రోజులుగా నిరసన దీక్షా కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, స్పందించడం లేదని కిష్టారం గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు,
మృతదేహంతో రోడ్డుపై బేటాయించి ధర్నా
సింగరేణి సైలో బంకర్ వలనే శ్వాసకోశ సంబంధ వ్యాధులతో లక్ష్మీనారాయణ మృతి చెందాడని కిష్టారం అంబేద్కర్ నగర్ కు చెందిన గ్రామ ప్రజలు మృతదేహంతో ఖమ్మం - సత్తుపల్లి నేషనల్ హైవేపై ధర్నా నిర్వహించారు. సీఎం డౌన్ డౌన్, అంటూ, జిల్లా మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి..ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్పందించిన సత్తుపల్లి పట్టణ సీఐ వెంటనే తన పోలీసు బలగాలతో అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి సమస్యను సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ..మరో వారం రోజుల్లో పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ ను సత్తుపల్లి పట్టణ సీఐ టీ కిరణ్, సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తు లింగయ్య, సత్తుపల్లి ఎస్సై రఘు, కవిత, ఆధ్వర్యంలోని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో కిష్టారం, అంబేద్కర్ నగర్, బీసీ కాలనీకి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






