ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

by velandi.Saikiran |

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఏరుగట్ల గ్రామంలో బుధవారం రాత్రి గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేశారు.

Occult worship in Khammam district
X

Occult worship in Khammam district

*ఏరుగట్ల గ్రామంలో క్షుద్ర పూజల కలకలం*

*గుప్త నిధుల కోసం కుట్ర‌ల‌కు తెర‌లేపిన దుండ‌గులు*

దిశ, సత్తుపల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఏరుగట్ల గ్రామంలో బుధవారం రాత్రి గుప్తనిధుల తవ్వకాల కలకలం రేపాయి. ఏరుగట్ల గ్రామంలోని ముత్యాలమ్మ గుడి సమీపంలో గుప్త నిధుల కోసం బుధవారం రాత్రి సమయంలో అదే గ్రామానికి చెందిన నలుగురు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు పూజరులతో కలిసి క్షుద్ర పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగానే జేసీబీతో గుప్తనిధుల కోసం తవ్వకాలు మొదలుపెట్టారు. అయితే, పక్కనే మిరప తోటల దగ్గర కాపలా ఉన్న రైతులు, జేసీబీ శబ్దాలు వినపడటంతో ఏం జ‌రుగుతోంద‌ని వెళ్లి చూశారు.

గుప్త నిధుల కోసం తవ్వకాలు

ఇక ముత్యాలమ్మ గుడి సమీపంలో క్షుద్ర పూజల వ్య‌వ‌హారం చూసి, గ్రామస్తులకు సమాచారం అందించారు. ఇక ఈ త‌రుణంలోనే గుప్త నిధుల తవ్వకాల కోసం వచ్చిన ముగ్గురు వ్యక్తులను పట్టుకొని వీఎం బంజర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు‌, ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకున్నారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన స్థలంలో పసుపు, కుంకుమ పోసి నిమ్మకాలయాలతో‌ క్షుద్ర పూజలు చేసి గుంతను తవ్వినట్లు పోలీసులు గుర్తించారు. గుప్త నిధుల తవ్వకాల కోసం ఉపయోగించిన జేసీబీ, మూడు బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story