- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోమయం..! భద్రాచలానికి తగ్గిన భక్తుల సంఖ్య
భద్రాచలం సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానానికి భక్తులు రావడం గణనీయంగా తగ్గింది. దేవస్థానం అభివృద్ధిలో భాగంగా, ఆలయ ప్రాంగణం లోని ఉపాలయాలు తొలగిస్తున్నారనే ప్రచారంతో భక్తులు అయోమయానికి లోనవుతున్నారు.

భద్రాచలం సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానానికి భక్తులు రావడం గణనీయంగా తగ్గింది. దేవస్థానం అభివృద్ధిలో భాగంగా, ఆలయ ప్రాంగణం లోని ఉపాలయాలు తొలగిస్తున్నారనే ప్రచారంతో భక్తులు అయోమయానికి లోనవుతున్నారు. భద్రాద్రిలో దర్శనాలు జరుగుతున్నాయా.. లేదా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో భద్రాద్రి రామయ్యను 2.78లక్షల మంది దర్శించుకోగా, 2026 ఏప్రిల్ నెలలో కేవలం 1.81లక్షల మంది భక్తులే దర్శించుకున్నారు. ఏప్రిల్ 25న చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో 15ఉపాలయాలలోని 72దేవతా మూర్తులకు ఒకేసారి కళావాహన సేవ నిర్వహించినప్పటి నుంచి అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు. దీంతో భక్తుల సంఖ్య గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చుకుంటే సుమారు లక్ష మంది భక్తులు తగ్గారు. - దిశ, భద్రాచలం
దిశ, భద్రాచలం: భద్రాచలం సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానం దేవస్థానం అభివృద్ధిలో భాగంగా, ఆలయ ప్రాంగణం లోని ఉపాలయాలు తొలగిస్తున్నారనే ప్రచారంతో భక్తులు అయోమయానికి లోనవుతున్నారు. భద్రాద్రిలో దర్శనాలు జరుగుతున్నాయా.. లేదా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో భద్రాద్రి రామయ్యను 2,78,730 మంది భక్తులు దర్శించుకోగా, 2026 ఏప్రిల్ నెలలో కేవలం 1,81,062మంది భక్తులే దర్శించుకున్నారు. ఏప్రిల్ 25న చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో 15ఉపాలయాలలోని 72దేవతా మూర్తులకు ఒకేసారి కళావాహన సేవ నిర్వహించి, దేవతా మూర్తులను రంగనాయక స్వామి గుట్టపై ఉన్న భక్త రామదాసు ధ్యానమందిరం లో ఏర్పాటు చేసిన బాలాలయంలో భద్రపరిచారు. కళావాహన సేవ జరిగిన నాటినుండి అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు. దీంతో భక్తుల సంఖ్య గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చుకుంటే సుమారు లక్ష మంది భక్తులు తగ్గారు.
గతేడాది శ్రీ రామనవమి ఏప్రిల్6న వచ్చింది. ఈ సంవత్సరం మార్చి నెలలో వచ్చింది. దీని ద్వారా కూడా గత సంవత్సరం ఏప్రిల్‌లో ఎక్కువ భక్తులు వచ్చి ఉండొచ్చు. అయినా సుమారు లక్ష మంది భక్తులు తగ్గడం చర్చనీయాంశంగా మారింది. మే నెలలో భక్తుల సంఖ్య కూడా తక్కువగా ఉంటే... ఆలయ అభివృద్ధి, దర్శనాలు, ఇతర సేవలపై భక్తులలో నెలకొన్న సందేహాలను ఆలయ అధికారులు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయని పక్షంలో భక్తుల సంఖ్య తగ్గి ఆలయానికి ఆదాయం పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. అలాగే ఆలయ నిర్మాణం గురించి ప్రాకారాలు ఎలా నిర్మిస్తున్నారు..? మాడ వీధులలో జరిగే అభివృద్ధి, ఆలయ నిర్మాణం సమయంలో దర్శనాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మీడియాను క్షేత్ర స్థాయికి తీసుకుని వెళ్లి ఆలయ అధికారులు వివరించాల్సి ఉంది. దీంతో తప్పుడు ప్రచారం ప్రజల్లోకి వెళ్లకుండా ఉంటుందని రామ భక్తులు అభిప్రాయపడుతున్నారు.






