- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైరాలో డ్రైవర్ లేని కారు..!
వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి డ్రైవర్ లేని కారు మాదిరిగా మారింది. ఎన్నికలు గడిచిన కొంత కాలంలోనే వైరా నియోజకవర్గంలో బలమైన క్యాడర్ కలిగి, మంచి పట్టు ఉన్న నేత మదన్‌లాల్ అనారోగ్య రీత్యా మరణించడంతో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి కార్యకర్తలు నాయకులను ముందుకు నడిపించే నేత లేకుండా పోయింది.

వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి డ్రైవర్ లేని కారు మాదిరిగా మారింది. ఎన్నికలు గడిచిన కొంత కాలంలోనే వైరా నియోజకవర్గంలో బలమైన క్యాడర్ కలిగి, మంచి పట్టు ఉన్న నేత మదన్‌లాల్ అనారోగ్య రీత్యా మరణించడంతో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి కార్యకర్తలు నాయకులను ముందుకు నడిపించే నేత లేకుండా పోయింది. 2023అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాములు నాయక్‌కు టికెట్ ఇవ్వకపోవడంతో ఎన్నికల అనంతరం ఆ పార్టీకి రాజీనామా చేయగా, పోటీ చేసిన మదన్ లాల్ ఓటమి పాలయ్యాడు. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పార్టీని నడిపించే రథసారథి భర్తీపై అధిష్టానం దృష్టి సారించకపోవడం కేడర్‌ని కలవరం పెడుతోంది. బలమైన నాయకుడు లేకపోవడంతో పార్టీ కార్యకర్తలు, పలువురు నాయకులు ఇప్పటికే హస్తం గూటికి చేరారు. పార్టీ పరంగా ఎటువంటి కార్యక్రమాలు చేయలేకపోతున్నామని పలువురు సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు మనోవేదన చెందుతున్నారని తెలిసింది. ఇలాగే కొనసాగితే పంచాయతీ ఎన్నికలలో అత్యధిక గ్రామ పంచాయతీలను కోల్పోయే అవకాశాలు లేకపోలేదని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
- దిశ, కారేపల్లి రూరల్
దిశ కారేపల్లి రూరల్ : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి డ్రైవర్ లేని కారు మాదిరిగా మారింది. కేడర్ ఇప్పటికీ బలంగా ఉంది. ఏ ఎన్నికైనా సై అంటోంది. కానీ నడిపే నాయకుడు లేక దిక్కులు చూస్తోంది. సరైన వారు ఒక్కరు తగిలితే చాలు మా సత్తా ఏంటో చూపిస్తామంటూ పార్టీ కార్యకర్తలు సై అంటున్నా అధిష్టానం మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదని ఆ పార్టీ శ్రేణులులు గగ్గోలు పెడుతున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీకి నాయకత్వ లేనీ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటూ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో ఎన్నికల అనంతరం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పటికీ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల మార్పులో భాగంగా మదన్‌లాల్ ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో మండల కమిటీలు సైతం స్తబ్దతగా ఉండిపోయాయి.
ఎన్నికలు గడిచిన కొంత కాలంలోనే వైరా నియోజకవర్గంలో బలమైన క్యాడర్ కలిగి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మంచి పట్టు ఉన్న నేత మదన్‌లాల్ అనారోగ్య రీత్యా మరణించడంతో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి కార్యకర్తలు నాయకులను ముందుకు నడిపించే నేత లేకుండా పోయింది పార్టీ క్యాడర్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. నడిపించే నాయకుడు లేకపోవడంతో పార్టీ కార్యకర్తలు పలువురు నాయకులు ఇప్పటికే హస్తం గూటికి చేరారు. మదన్‌లాల్ మృతి చెందినప్పటి నుంచి మరో నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు వైరా నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరినప్పటి నుంచి మదన్ లాల్ గెలిచిన నాటి నుంచే తాను బలపడటంతో పాటు పార్టీని బలోపేతం చేశారు. అయినప్పటికీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమి తప్పలేదు. ఇక అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారడం, వైరా నియోజకవర్గంలో పార్టీ నడిపించే నాయకుడు కరువయ్యాడు. నియోజకవర్గంలో పార్టీని నడిపించే రథసారథి భర్తీపై అధిష్టానం కూడా దృష్టి పెట్టకపోవడం కేడర్‌ని కలవరం పెడుతోంది.
లీడర్ గడప దాటిన…
క్యాడర్ మాత్రం చెక్కు చెదరకపోవడం ఇక్కడ పార్టీకి బలం.పార్టీ పెద్దలు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు. నడిపే నాయకుడు ఎప్పుడు వస్తాడు అంటూ కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. పార్టీ శ్రేణులు వైరా నియోజకవర్గం గులాబీ పార్టీ ద్వితీయ శ్రేణినాయకులు కార్యకర్తలు తాజాగా అధిష్టానం పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లోగే తాము కూడా రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేయాలని ఉన్న, ముందుండి నడిపించే బలమైన నేత లేకపోవడంతో ఎవరికి వారుగా ఏం చేయలేకపోతున్నామని పలువురు సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు మనోవేదన చెందుతున్నారని తెలిసింది. నియోజకవర్గంలో జరిగే పంచాయితీ ఎన్నికలలో అత్యధిక సర్పంచ్ సీట్లు గెలిపించుకునే సత్తా బీఆర్ఎస్‌కు ఉన్నప్పటికీ అధిష్టానం ఇప్పటివరకు సరైన నేతను నియమించకపోవడంతో ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. వైరా నియోజకవర్గ కారుకు ప్రస్తుతానికి డ్రైవర్ లేరు. ఈ సమయంలో ఇలా వదిలేస్తే ఎలాగన్న ప్రశ్న పార్టీ క్యాడర్లో కూడా వస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన కొందరు నేతలు తాజాగా మౌనవ్రతం చేస్తుండటం మంచిది కాదని అంటుంది. పార్టీ క్యాడర్ భావిస్తున్న సరైన సమయంలో కీలక నిర్ణయం తీసుకొవాల్సిన పార్టీ పెద్దలు ఇలా ఉదాసీనంగా ఉండటం కూడా కరెక్ట్ కాదన్న అభిప్రాయం కార్యకర్తలలో పెరుగుతోంది గులాబీ పార్టీ పెద్దలు క్యాడర్ సహనాన్ని పరీక్షిస్తున్నారా?అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు స్పందించి వైరా నియోజకవర్గానికి సరైన రథ సారథిని నియమించకపోతే పార్టీకి తీరని నష్టం వాటిల్లడంతో పాటు త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలలో అత్యధిక గ్రామ పంచాయతీలను కోల్పోయే అవకాశాలు లేకపోలేదని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.






