- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : ఎస్ఐ పుష్పాల రామారావు
దిశ, వైరా : నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని వైరా ఎస్సై పుష్పాల రామారావు అన్నారు. నూతన సంవత్సర వేడుకల నిబంధనలకు సంబంధించి బుధవారం ఆయన ప్రకటనను విడుదల చేశారు.

దిశ, వైరా : నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని వైరా ఎస్సై పుష్పాల రామారావు అన్నారు. నూతన సంవత్సర వేడుకల నిబంధనలకు సంబంధించి బుధవారం ఆయన ప్రకటనను విడుదల చేశారు. మద్యం మత్తులో రోడ్లపై వేగంగా ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల అనుమతి లేకుండా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించవద్దని సూచించారు. ఆర్కెస్ట్రా, సౌండ్ సిస్టం, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజే లను ఆర్కెస్ట్రాలను సౌండ్ సిస్టంలను ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి వైరా పట్టణంతోపాటు మండలంలోని గ్రామాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలు పర్యటించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తారని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగటం నిషేధించామన్నారు. మైనర్లు యువకులు బైకు రైడింగులు చేసి ప్రమాదాలకు కారణం కావద్దని సూచించారు. మైనర్లకు బైకులు ఇచ్చే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.






