- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాలీబాల్ పోటీల్లో న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థి ప్రతిభ
పటాన్ చెరువులోని మైత్రి స్టేడియం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన 69వ రాష్ట్రస్థాయి వాలీబాల్ అండర్-17

దిశ, వైరా: హైదరాబాద్ పటాన్ చెరువులోని మైత్రి స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన 69వ రాష్ట్రస్థాయి వాలీబాల్ అండర్-17 బాలుర విభాగం ఫైనల్ లో వైరా న్యూ లిటిల్ ఫ్లవర్ కళాశాల విద్యార్థి తన ప్రతిభను చాటాడు. ఈ వాలీబాల్ ఫైనల్ లో వరంగల్ జట్టును ఓడించి, ఖమ్మం జట్టు ప్రథమ స్థానం కైవసం చేసుకున్నది. ఖమ్మం జట్టు నుండి న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్ధి దేవభక్తిని రోహన్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ సందర్భంగా న్యూ లిటిల్ ఫ్లవర్ కరెస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు మాట్లాడుతూ వాలీబాల్ అండర్-17 బాలుర విభాగంలో ఖమ్మం జట్టు నుండి ప్రాతినిధ్యం వహించిన రోహన్ క్రమశిక్షణగా పోటీల్లో పాల్గొని తన సత్తా చాటాడు అని చెప్పారు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడంతో పాటు పీఈటీల ఆధ్వర్యంలో అత్యుత్తమ శిక్షణ రోహన్ కు ఇవ్వటంతో ఈ విజయం సాధ్యమైందన్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయి జట్టులో కూడా రోహన్ స్థానం సంపాదించి రాష్ట్రం తరఫున, దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. అనంతరం రోహన్ ను కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు, డైరెక్టర్ కుర్రా సుమన్, ప్రిన్సిపాల్స్ షాజీ మాథ్యూ, భువన ప్రసాద్, ఏవో సామినేని నరసింహారావు అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు.






