- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్ ఎస్ సి ఫలితాలలో న్యూఇరా, న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యాసంస్థల విజయ దుందుభి..
బుధవారం ప్రకటించిన ఎస్ ఎస్ సి ఫలితాలలో ఖమ్మం న్యూఇరా, వైరా న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి తమ సత్తా చాటారు.

దిశ, వైరా: బుధవారం ప్రకటించిన ఎస్ ఎస్ సి ఫలితాలలో ఖమ్మం న్యూఇరా, వైరా న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి తమ సత్తా చాటారు. ఈ విద్యా సంస్థలకు చెందిన డి. రుచిత 588, ఎం. వినీత్ 580, బి. హారిక 563, శ్రీవిద్య 562 మార్కులు సాధించి తమ ప్రతిభను కనపరిచారు. అంతే కాకుండా 52 మంది విద్యార్థులు 500 లకు పైగా మార్కులు సాధించి న్యూఇరా న్యూ లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల సత్తా చాటారు. పరీక్ష రాసిన ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఒకరికి 500కు పైగా మార్కులు రావడం గమనార్హం. సబ్జెక్ట్ వారీగా తెలుగులో 39, హిందీలో 101, ఇంగ్లీష్ లో 116, మాథ్స్ లో 76, సైన్స్ లో 50, సోషల్ లో 79 మంది విద్యార్థులు ఏ గ్రేడ్ సాధించడం విశేషం. ఈ విద్యా సంస్థల్లో 10వ తరగతి చదివిన విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ ఐ.వి.రమణారావు, డైరెక్టర్ డాక్టర్ పోతినేని భూమేశ్వర్ రావు మాట్లాడుతూ.. న్యూఇరా, న్యూ లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి ఖమ్మం జిల్లా స్థాయిలోనే తమ సత్తా చాటారని చెప్పారు. 10వ తరగతి స్టేట్ సిలబస్ ఫలితాలతో పాటు త్వరలో విడుదల కానున్న సెంట్రల్ సిలబస్ ఫలితాల్లో కూడా తమ విద్యార్థులు రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులతో తమ విద్యాసంస్థలు ఉత్తమ ఫలితాలు సాధించటం ఖమ్మం జిల్లాకే గర్వకారణం అన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఐ.వి.రమణారావు, పోతినేని భూమేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు.






