ఆగస్టులో ‘నెల నెలా వెన్నెల’ 8వ వార్షికోత్సవ సంబరాలు..

by Chintha Aamani |

నెల నెలా వెన్నెల 8వ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు నెలలో 7, 8, 9, 10 తేదీలలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తున్నారు.

ఆగస్టులో ‘నెల నెలా వెన్నెల’ 8వ వార్షికోత్సవ సంబరాలు..
X

దిశ, ఖమ్మం : నెల నెలా వెన్నెల 8వ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు నెలలో 7, 8, 9, 10 తేదీలలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్బంగా అన్నాబత్తుల సుబ్రమణ్య కుమార్, మోటమర్రి జగన్మోహన్ రావు, కొత్తూరు దేవేంద్ర, చీఫ్ ప్యాట్రన్ డా. నాగబత్తిని రవి, కురువెళ్ళ ప్రవీణ్, డా. వేల్పుల విజేత, వేముల సదానంద్, నందిగం కృష్ణ లు విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. బుధవారం ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా కళారంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ స్థాయిలో ఒక మూడు భిన్న మార్గంలో ప్రయాణం చేసే కళా సంస్థలు ఒకేచోట ఎటువంటి ప్రయోజనాలు ఆశించకుండా ఖమ్మం కళాభిమానులను గత 8 సంవత్సరాలుగా పండు వెన్నెల్లో పరవశింపజేస్తున్న అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ (ఆర్మ్స్) ఖమ్మం కళా పరిషత్, ప్రజానాట్యమండలి ఖమ్మం జిల్లా కమిటీలు అవిశ్రాంత శ్రామికులు అనడంలో అతిశయోక్తి లేదన్నారు.

నెల నెలా వెన్నెల 2007లో రంగస్థల వేదిక ఒకటి ఏర్పాటు చేయాలని అనేక మంది కళాపోషకులు, కళాకారులు, కళాభిమానులు, మేధావులు మేధో మధనం చేసి దానికి మన ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రం కేంద్రంగా నడపాలని నాటి ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ భావించింది న్నారు. అప్పటి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎ. ఎస్. కుమార్, కె. దేవేంద్రలు భుజానికేసుకుని జిల్లా కమిటీ సభ్యుల సహకారంతో భక్త రామదాసు కళాక్షేత్రం లో కనీస సౌకర్యాలు కూడా లేని అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో తమ శక్తికి మించి ఆర్థిక భారంతో కొన్ని నెలల పాటు ప్రయాణించి ఆగిపోవాల్సి వచ్చిందన్నారు.

గత సంవత్సరం నుండి ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. నెల నెలా వెన్నెల ఇందుకు భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం మా వెన్నంటే ఉండి ఆర్థిక, హార్దిక సహకారం అందిస్తున్నారు. పరుచూరి పరిషత్ ను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో వార్షికోత్సవం సందర్భంగా పరిషత్ ను నిర్వహించాలని, తలపించి గత సంవత్సరం నుండి ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. గత సంవత్సరం మూడు రోజుల పాటు నిర్వహించామని, ఈ సంవత్సరం ఆగస్టు 7, 8, 9, 10 తేదీలలో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ పరిషత్ నిర్వహణ చాలా ఖర్చు, శ్రమ తో కూడుకున్నదని, దీనికి ప్రత్యేకంగా మరికొంతమంది పెద్దలను కలుపుకొని పరిషత్ నెల నెలా వెన్నెల చీఫ్ ప్యాట్రన్ డా. నాగబత్తిని రవి, మొగిలి శ్రీనివాసరెడ్డి, కురువెళ్ళ ప్రవీణ్, డా. వేల్పుల విజేత, తుళ్ళూరు కోటేశ్వరరావు, బైరు హరినాథబాబులు ఈ నాటిక పోటీల విజయవంతానికై సహకారం అందిస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి ప్రతి నెల నెలా నెలా వెన్నెల ప్రేక్షకులకు తేనీటి విందుని,ఈ పరిషత్ సందర్భంగా కళాకారులు, కార్యకర్తలకు భోజనం, వసతి సౌకర్యాలను కల్పిస్తూ తమ కళా హృదయాన్ని చాటుకున్నారని తెలిపారు‌.

Next Story