- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విధుల్లో వార్డెన్ నిర్లక్ష్యం
దిశ, కారేపల్లి రూరల్ : మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి రెవెన్యూ పరిధిలోని శాంతినగర్ బాలుర ఆశ్రమ పాఠశాలలో తొమ్మిది తరగతి

దిశ, కారేపల్లి రూరల్ : మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి రెవెన్యూ పరిధిలోని శాంతినగర్ బాలుర ఆశ్రమ పాఠశాలలో తొమ్మిది తరగతి చదువుతున్న విద్యార్థి సాగర్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయల పాలైన విషయం తెలిసిందే. వార్డెన్ విధుల పట్ల నిర్లక్ష్యం ఫలితంగా పాఠశాల విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ రోడ్డు ప్రమాదం ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు వార్డెన్ పై నామ్ కె వాస్తు చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఉపాధ్యాయుడికి వార్డెన్ బాధ్యతలు తొలగించి మరొక ఉపాధ్యాయుడికి వార్డెన్ బాధ్యతలు అప్పగించి మమ అనిపించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్ ను సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి సంఘాలు నేతలు డిమాండ్ చేయగా.. అధికారులు మాత్రం వార్డెన్ బాధ్యతలు తప్పించి స్థానిక హాస్టల్లోనే విధులు కేటాయించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వార్డెన్ నిర్లక్ష్యంతో విద్యార్థి రోడ్డు ప్రమాద ఘటన పై దిశ దినపత్రికలో ప్రచురమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. విధులు నిర్లక్ష్యంగా వివరించిన వార్డెన్ కు వార్డెన్ బాధ్యతలు తొలగించారు. వార్డెన్ గతంలో ఏన్కూరు మండలం ముళ్ళ పోచారం ఆశ్రమ పాఠశాలలో ఏకతాటిగా తొమ్మిది సంవత్సరాలు వార్డెన్ గా విధులు నిర్వహించారు. ఈ క్రమంలో పై అధికారులతో కుమ్మక్కై నెలకోసారి ఉపాధ్యాయులకు పార్టీలు ఇస్తారని ఆరోపణలు ఉన్నాయి. అక్కడ కూడా ఓ విద్యార్థికి గోడ పై నుంచి కింద పడడంతో గాయమైన క్రమంలో అధికారులు యాక్షన్ తీసుకోకుండా మేనేజ్ చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా ఐ.టీ.డీ.ఏ పి.ఓ సార్ స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి.






