- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయ సైద్దాంతిక శిక్షణ అవసరం : దండి సురేష్
దిశ, ఖమ్మం రూరల్ : యువతలో రాజకీయ సైద్ధాంతిక శిక్షణతో పాటు సమాజం పట్ల అవగాహన అవసరమని సీపీఐ

దిశ, ఖమ్మం రూరల్ : యువతలో రాజకీయ సైద్ధాంతిక శిక్షణతో పాటు సమాజం పట్ల అవగాహన అవసరమని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ అన్నారు. ఆదివారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం క్రాస్ రోడ్డు సమీపంలోని ఓపెన్ గ్రౌండ్లో ఖమ్మం రూరల్ మండలం మొదటి దశ జనసేవా దళ్ శిక్షణా శిబిరం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. తొలుత అక్కడ ఏర్పాటు చేసిన ఏఐవైఎఫ్ అరుణ పతాకాన్ని సీపీఐ జిల్లా సమితి సభ్యుడు చెరుకుపల్లి భాస్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ... జనాభాలో సగానికి పైగా కలిగిన యువత పాలక వర్గాల తీరుతో నైరాశ్యానికి గురవుతుందన్నారు. ఉపాధి, ఉద్యోగాల కల్పనలో పాలకులు విఫలం కావడంతో యువశక్తి నిర్వీర్యమవుతుందన్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో యువత చైతన్యవంతమైన ఆలోచనలతో రాజకీయాల్లోకి రావాలని వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులకు మద్దతుగా నిలవాల్సి ఉందన్నారు. నిరుద్యోగం పెరిగిన నేపథ్యంలో పాలకులు కర్మ సిద్దాంతాన్ని బోధిస్తూ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు. సుదీర్ఘ కాలం పోరాటాలతో అనేక హక్కులను, సంక్షేమ పథకాలను సాధించిన భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవ ముగింపు ఉత్సవాలను జనవరి 18న ఖమ్మంలో జరగనున్నాయన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఐదువేల మంది యువకులకు జన సేవాదళ్ శిక్షణ ఇస్తుమన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రను నేటి తరానికి తెలియజేస్తూ సమస్యలపై జరిగే పోరాటాలకు సంబంధించి కార్యోన్ముఖులను చేయడమే లక్ష్యంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నామని సురేష్ తెలిపారు. శిక్షణను ఇన్ స్ట్రక్టర్ మురళీకృష్ణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మిడకంటి చిన్న వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా సమితి సభ్యుడు వెంపటి సురేందర్, సీపీఐ మండల సమితి సభ్యులు దండి రంగారావు, వెన్నం భాస్కర్, దొంతగాని వెంకన్న, గణపరపు వీరన్న మామిండ్ల నిరంజన్ రెడ్డి, పొన్నెకంటి రామకృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ననబాల రామకృష్ణ, ఏవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు గణపరపు ఉపేందర్, ఏఐవైఎఫ్ పాలేరు నియోజకవర్గ కార్యదర్శి మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ మండల నాయకుడు మిడకంటి అభిరామ్ రెడ్డి పాల్గొన్నారు.






